TGPSC General Ranking List | ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. గత సంవత్సరం అక్టోబర్‌లో గ్రూప్-1 పరీక్షలను నిర్వహించిన టీజీపీఎస్సీ, ఈ సంవత్సరం మార్చి 10న తాత్కాలిక మార్కులను వెల్లడించింది. ఇప్పుడు తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
టాప్ టెన్‌లో ఆరుగురు మహిళలు ఉండగా, నలుగురు పురుష అభ్యర్థులు ఉన్నారు. 900 మార్కులకుగాను 550 మార్కులతో జనరల్ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలిచారు. టాప్ 10లో బీసీలు ముగ్గురు మాత్రమే ఉండగా, మిగిలినివారంతా ఓసీ అభ్యర్థులే కావడం విశేషం. కాగా, రీకౌంటింగ్ పెట్టుకున్న వారికి ఒక్క మార్కు కూడా పెరగని కూడా పెరగలేదు. దీంతో రీకౌంటింగ్ కేవలం నిరుద్యోగుల డబ్బులు దోచుకోవడానికేనని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.