PECET 2025 Results | బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ ( టీజీపీఈసెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చైర్మన్ వీ బాలకృష్ణారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.
బీపీఈడీలో 95.79 శాతం, డీపీఈడీలో 92.61 శాతం చొప్పున అభ్యర్థులు అర్హత సాధించారు. బీపీఈడీలో 1307 మందికి 1257 మంది.. డీపీఈడీలో 460 మందికి 426 మంది క్వాలిఫై అయ్యారు.
ర్యాంకర్లు వీరే
బీపీఈడీలో ఎస్ జ్యోతిర్మయి మొదటి ర్యాంక్.. కేతావత్ రజిత రెండో ర్యాంక్.. కే అచ్యుత కుమారి మూడో ర్యాంకులు సాధించారు. డీపీఈడీలో చింతం ఉమాశ్రీ మొదటి ర్యాంకు, జటావత్ లక్ష్మణ్ రెండో ర్యాంక్, ఎం సాయి తేజ మూడో ర్యాంకును సాధించారు.