హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఎగ్జామ్ సోమవారం నిర్వహించనున్నామని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించేందుకు 71 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈసారి 66,864 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నట్టు వెల్లడించారు. మూడేండ్ల లా కోర్సుకు 47,573, ఐదేండ్ల లా కోర్సుకు 14,077, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు 5,214 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు https://lawcet.tgche.ac.in వెబ్సైట్ను సంప్రదించి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.