హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ తెలిపారు.
ఈ నెల 15న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు 18,626 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 17,870 (95.94శాతం)హాజరయ్యారు.