హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 22 వరకు 10 సెషన్స్‌లో వీటిని నిర్వహిస్తారు. 16 జిల్లాల్లో 61 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు.
పేపర్-1కు 50,113 మంది, పేపర్-2కు 1,03,639 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు.