హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 1,411 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. మొదటి భాషా పేపర్‌కు పరీక్ష నిర్వహించగా 6,086 మంది విద్యార్థులకు 4,675(76.82%) మంది పరీక్ష రాశారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే లింగయ్య తెలిపారు.