హైదరాబాద్: భారతీయ రైల్వేలో (Railway Jobs) భాగమైన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్ (RITES) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (Senior Technical Assistant) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు రెండేండ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 150 పోస్టులు
ఇందులో సౌత్ రీజియన్‌లో 15, నార్త్ రీజియన్‌లో 50, ఈస్ట్‌లో 75, వెస్ట్‌లో 10 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు: మెకానికల్, ప్రొడక్షన్ లేదా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ బ్రాంచ్‌తో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే 50 శాతం, ఎస్సీ లేదా ఎస్టీ ఇతర ఓబీసీ-ఎన్సీఎల్ గానీ దివ్యాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం కావాలి. 2025, డిసెంబర్ 30 నాటికి 40 ఏండ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 125 మార్కులు. నెగెటివ్ మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, లాజికల్ రీజనింగ్, బేసిక్ అవేర్నెస్/ జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. హైదరాబాద్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025, డిసెంబర్ 30
రాత పరీక్ష: 2026, జనవరి 11న
వెబ్సైట్: https://www.rites.com/