న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్-బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 18 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 294 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రూప్-బీ డీఆర్ జనరల్, డీఈపీఆర్, డీఎస్ఐఎం ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 294
ఇందులో గ్రేడ్-బీ డీఆర్ జనరల్ 238, డీఈపీఆర్ 31, డీఎస్ఐఎం 25 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్యవయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
ఆన్లైన్ రాతపరీక్ష: మే 28, జూన్ 25, జూలై 2, ఆగస్టు 6న
వెబ్సైట్: www.rbi.org.in