హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో 4,200 సీట్లు పెరుగనున్నాయి. కొత్తగా 10 కోర్సులను ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టగా వీటిలో 2,220 సీట్లు పెరిగాయి. మొత్తంగా 33,140 సీట్లు పాలిటెక్నిక్ కోర్సుల్లో లభ్యంకానున్నాయి.
ఈడబ్ల్యూఎస్ యేతర సీట్లు 30,210 ఉండగా, ఈడబ్లూఎస్ కోటాలో 2,930 సీట్లున్నాయి. 59 ప్రభుత్వ, 52 ప్రైవేట్ కాలేజీల్లో ఈ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతి ఇచ్చింది.