హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ (Polycet) ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయని, ఏప్రిల్ 24 వరకు www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
పాలిసెట్ ద్వారా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, వెటర్నరి, హార్టికల్చర్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సందేహాలుంటే 040 -23222192, polycet-te@telangana. gov. in ఈమెయిల్‌ను సంప్రదించాలని సూచించారు.