హేతువాదం ఆధారంగా నోమ్ ఛామ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతం? (ఎస్ఏ 2018) 1) దైవదత్తవాదం 2) స్వభావవాదం 3) భౌభౌ వాదం 4) స్వతస్సిద్ధవాదం
భాషా వికాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? (టెట్ 2017) 1) ఛామ్స్కీ 2) గెస్టాల్ట్ 3) యెర్క్స్ 4) బీఎఫ్ స్కిన్నర్
భాష జన్మతః అలవడుతుందని, అనుభవాలు కేవలం భావ ఉద్దీపనాన్ని కలిగిస్తాయని ప్రతిపాదించింది? (పీజీటీ 2018) 1) ప్లేటో 2) డార్విన్ 3) స్కిన్నర్ 4) ఛామ్స్కీ
ధ్వనులను బట్టి కొందరు భాషాశాస్త్రవేత్తలు భాషావిభజనానికి యత్నించారు. వారి విభజన ప్రకారం తెలుగు? (ఎస్జీటీ 2019) 1) త్రిస్వర భాష 2) పంచస్వర భాష 3) సప్తస్వర భాష 4) బహుస్వర భాష లెవల్-2
బ్రహ్మాండం విస్ఫోటనం చెందిన ప్రకృతి, దానితోపాటు ‘ఓం’ అనే శబ్దం ఏర్పడిందని, ఆ ‘ఓం’ కారమే భాషకు మూలరూపమని ఎవరి వాదన? 1) శ్రమజీవులది 2) సమాలోచనవాదులది 3) స్ఫోటవాదులది 4) దైవదత్తవాదులది
కింది మొదటివరుసలోని భాషోత్పత్తివాదాలు, రెండో వరుసలోని వాటిని బలపర్చినవారితో జతపర్చండి? మొదటి వరుస రెండోవరుస అ. దైవదత్తవాదం య. పైథాగరస్, ప్లేటో ఆ. స్వభావవాదం ర. జొహాన్ గాట్ప్రైడ్, లిబ్నెజ్ ఇ. సంకేతవాదం ల. ట్రాంబెట్టి (ఇటలీ) ఈ. భౌభౌ/ధ్వన్యనుకరణవాదం వ. డెమిట్రియస్, అరిస్టాటిల్ మొదటి వరుసలోని అ, ఆ, ఇ, ఈలకు రెండోవరుసలో సరిపోయేవి 1) య, ర, ల, వ 2) ల, వ, య, ర 3) ల, య, వ, ర 4) ర, య, వ, ల
పాణిని వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలు అంటారు. అయితే 14 మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించాయని పెద్దలు విశ్వసించడానికి కారణమైనది?(ఎస్జీటీ 2012, టెట్ 2018) 1) నటరాజు ఢమరుక శబ్దం 2) మహావిష్ణువు శంఖధ్వని 3) ఇంద్రుని వజ్రాయుధ సవ్వడి 4) గజేంద్రుని ఆర్తనాదం
మానవులు నాగరికతవైపునకు పయనిస్తున్నకొద్దీ అవసరాన్నిబట్టి సహజంగా, అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పర్చుకొన్నారని తెలిపేవాదం, ఆ వాదాన్ని ప్రతిపాదించినవారు? 1) అన్వయవాదం (థియరీ ఆఫ్అగ్రిమెంట్)- డెమొక్రటిస్, అరిస్టాటిల్ 2) స్వభావవాదం (థియరీ ఆఫ్ ఇన్హెరెంట్ నెసెసిటీ)- పైథాగరస్, ప్లేటో 3) యో-హి-హో వాదం- నోయిర్ 4) ధ్వన్యనుకరణ వాదం- జొహాన్ గాట్ప్రైడ్
ఆదిమానవుడు జంతువులు, పక్షులు చేసే ధ్వనులు, అరుపులను (మే మే అనేది మేక, కావ్ కావ్ అనేది కాకి, భౌ భౌ అనేది కుక్క) అనుకరించి తన భాషారూపాన్ని, పదాలను నిర్మించుకున్నాడు అని తెలిపేవాదం? 1) వివక్షాప్రేరణ వాదం 2) ఆశ్చర్యవాదం 3) యో-హి-హో వాదం 4) ధ్వన్యనుకరణ వాదం
లకుముకి పిట్టలు వంటివి ఆహార అన్వేషణలో చెట్ల బెరడులను ముక్కుతో పొడిచేటప్పుడు ‘టక్ టక్’ అనే శబ్దం వస్తుంది. ఇటువంటి పక్షులు చేసే శబ్దాలే భాషోత్పత్తికి మూలం అని వాదించేవారు? 1) దైవదత్త వాదులు 2) యో-హి-హో వాదులు 3) స్వతస్సిద్ధ వాదులు 4) టట్టట్ వాదులు/పూపూ వాదులు
బరువైన పనులు చేసేటప్పుడు నాదతంత్రులు బిగిసి ఉచ్ఛాస నిశ్వాసలు బరువుగా సాగి నోటి నుంచి, ముక్కు నుంచి కొన్ని ధ్వనులు వెలువడుతాయి. ఈ ధ్వనులే భాషకు మూలం అని తెలిపేవాదం, ఈ వాదాన్నిప్రతిపాదించినవారు? 1) ధ్వన్యనుకరణ వాదం- జొహాన్ గాట్ప్రైడ్ 2) యో-హి-హో వాదం- నోయిర్ 3) స్వతస్సిద్ధ వాదం- నోమ్ ఛామ్స్కీ 4) డింగ్ డాంగ్ వాదం- మాక్స్ ముల్లర్
ప్రతి శబ్దానికి, అర్థానికి తనదైన ఆంతరంగికమైన సంబంధం ఉంటుందని భావిస్తారు. ప్రతి వస్తువును తాకగానే ఒక ధ్వని-ప్రకంపన ఉత్పన్నమై మనిషి మనస్సులో వాగ్రూపంగా స్థిరపడి భాషోత్పత్తి కలిగిందని తెలిపేవాదం? 1) మౌఖిక-అభినయ వాదం/టక్-టక్ వాదం 2) డింగ్ డాంగ్ వాదం/ప్రకంపనా వాదం 3) నైయాకరణ, వైయాకరణ వాదాలు 4) ధాతువాదం/ధాతుజన్యవాదం
‘పాఠశాల గంట కొట్టగానే పాఠశాలను విడిచిపెట్టడం లేదా పాఠశాలలోకి ప్రవేశించడం’ అనే ఉదాహరణ ఏ వాదాన్ని సమర్థిస్తుంది? 1) మౌఖిక అభినయ వాదం 2) దైవదత్త వాదం 3) సంపాదనావాదం/అనుభవ వాదం 4) డింగ్ డాంగ్ వాదం/ప్రకంపనావాదం
గుసగుస, కటకట, జిగ్ జాగ్, డింగ్ డాంగ్ బెల్, గంట గణగణ మని మోగింది, గుండె దడదడలాడింది అనే ఉదాహరణలు ఏ వాదాన్ని సమర్థిస్తాయి? 1) మౌఖిక-అభినయ వాదం 2) డింగ్ డాంగ్ వాదం/ప్రకంపనా వాదం 3) దైవప్రసాదవాదం 4) అనుభవవాదం/సంపాదనావాదం
ధాతుజన్య వాదానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి? ఎ. ధాతువులు ప్రధానంగా రెండు రకాలు 1 నామధాతువులు, 2 క్రియాధాతువులు బి. నామధాతువుల వల్ల భాష పుట్టిందన్న వారు- గార్గ్యాదులు సి. క్రియాధాతువుల వల్ల భాష పుట్టిందన్న వారు- శాకటాయనులు 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) సి
‘ధాతువులు’ (క్రియల మూలరూపాలు)కు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి? ఎ. సెమెటిక్ భాషాకుటుంబంలో మూడక్షరాల ధాతువులున్నాయి బి. ఇండోయూరోపియన్ భాషాకుటుంబంలో ఏకాక్షర ధాతువులు ఉన్నాయి సి. నిరంతరం ధాతువులతోనే వ్యవహారం కొనసాగించేవారు- చైనీయులు డి. ద్రావిడ భాషల్లో మధ్యమ పురుష క్రియలుగా ఉపయోగపడేవి- ధాతువులు 1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) సి, డి 4) ఎ, బి, సి, డి
‘మానవుడు జంతుజాలం నుంచి ఆవిర్భవించి సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో, భాష కూడా ఒక వరుసక్రమంలో సహజ పరిణామం చెంది ఉండవచ్చు’ అని తెలిపే వాదం? 1) క్రమ పరిణామ వికాస వాదం 2) స్వతస్సిద్ధవాదం 3) మౌఖిక అభినయవాదం 4) ఏకమూల భాషావాదం
పరిణామక్రమంలో మానవుడి మెదడు, స్వరపేటిక, దంతాలు, పెదవులు మొదలైన అవయవాలు ఎంతో పరిణతి చెంది మాటలు వెలువరించడానికి రూపొందాయి. ఈ సహజసిద్ధ క్రమవికాసమే భాషోత్పత్తికి మూలకారణం అని భావించే వాదం? 1) మౌఖిక అభినయ వాదం/ టక్ టక్ వాదం 2) ప్రవృత్తి వాదం 3) క్రమ పరిణామ వికాస వాదం 4) స్వతస్సిద్ధ వాదం
వివిధ చేష్టలు, సౌంజ్ఞలు, సంకేతాలు, ధ్వనులు భావప్రసరణకు ప్రాచీన మానవులు వినియోగించేవారని, ఈ క్రమంలో భాషాధ్వనులు రూపొందాయని తెలిపినవారు? 1) దైవదత్తవాదులు 2) ప్రకంపనావాదులు 3) ప్రవృత్తి వాదులు 4) సహజపరిణామ వాదులు
ఏ భాషోత్పత్తి వాదం ప్రకారం బీఎఫ్ స్కిన్నర్ ప్రేరణలు, స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు,అలవాట్లు జ్ఞానంగా మారుతాయని నిరూపించాడు? 1) సంపాదనావాదం/అనుభవ వాదం 2) స్వతస్సిద్ధ వాదం 3) దైవదత్తవాదం 4) యో-హి-హో వాదం
స్వతస్సిద్ధ వాదానికి సంబంధించని ప్రవచనం? 1) భాషోత్పత్తి వాదాల్లో ఈ వాదం గొప్ప విప్లవం 2) చిన్నపిల్లల మెదడులో ‘సార్వత్రిక భాషావికాసం’ ఉంటుందని శైశవ దశ నుంచే వారు పరిసరాల నుంచి విన్న పదాలు, గ్రహించిన శబ్దాలు ఆ విభాగంలో చేరి, వారికి ఒక వయస్సు వచ్చేటప్పటికి ఎవరు నేర్పకుండానే స్వతస్సిద్ధంగానే వారు మాట్లాడుతారని తెలిపే వాదం 3) 4, 5 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు తగిన పరిసరాలు తోడైతే 3, 4 భాషలు మాట్లాడగలరు 4) అనుభవపూర్వక సంపాదనావాదాన్ని ఛామ్స్కీ సమర్థించాడు
నోమ్ ఛామ్స్కీ విశ్వవ్యాకరణం (యూనివర్సల్ గ్రామర్)కు సంబంధించి సరికాని ప్రవచనం? 1) ఛామ్స్కీ వాదాలను పియాజే, బ్రూనర్ సమర్థించారు 2) విశ్వవ్యాకరణాన్నే మానసిక వ్యాకరణం (మెంటల్ గ్రామర్) అంటారు 3) భాషాజ్ఞానం, భాషాభ్యసన శక్తి ఆంతరంగికం అని, అభ్యసన ఫలితంగా నేర్చుకున్నవి కావని సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే రచనలో ప్రతిపాదించాడు 4) నిర్దేశిత (ప్రిస్క్రిప్టివ్), వర్ణనాత్మక (డిస్క్రిప్టివ్), బోధనాత్మక వ్యాకరణాలకు భిన్నమైంది
నోమ్ ఛామ్స్కీ విశ్వవ్యాకరణ సిద్ధాంతానికి సంబంధంలేని అంశాన్ని గుర్తించండి? 1) జన్యుపరంగానే మానవ శిశువులకు ఒక భాషా వ్యవస్థ సంక్రమించిందని భావించే సిద్ధాంతం/వాదం 2) శిశువుల్లోని భాషను పొందే శక్తి ఏ భాషనైనా నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. దీన్నే సార్వత్రిక భాషా విభాగం (యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ) అంటారు 3) పిల్లల్లో సహజసిద్ధంగా భాషాపరమైన ఆంతరంగిక శక్తి ఉందనేది ఛామ్స్కీ వాదం 4) అనుభవపూర్వక సంపాదనావాదాన్ని ఛామ్స్కీ సమర్థించాడు
ప్రతి పిల్లవాడు తనదైన భాషాభ్యసన వ్యవస్థను పుట్టుకతోనే కలిగి ఉంటాడు. దీన్నే ఛామ్స్కీ ‘లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ (ఎల్ఏడీ)’ అన్నాడు. ఇది మెదడులో ఎక్కడో నిక్షిప్తమై ఉంటుందని, దానిలో ప్రపంచ భాషలన్నింటికి అన్వయించే సార్వజనీన వాక్య నిర్మాణ సూత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. దీన్నే ఇలా పిలుస్తారు? 1) వర్ణనాత్మక వ్యాకరణం 2) తులనాత్మక వ్యాకరణం 3) చారిత్రక వ్యాకరణం 4) విశ్వవ్యాకరణం
ఏ భాషలోనైనా శిశువు ఐదారేండ్లకే మాట్లాడటం నేర్చుకోవడం ఏ వాదానికి ఆధారం? 1) స్వతస్సిద్ధవాదం 2) స్వభావవాదం 3) సాంకేతికవాదం 4) అనుభవవాదం
లోక్నాథ్ రెడ్డి విషయ నిపుణులు ఏకేఆర్ స్టడీ సర్కిల్ ,వికారాబాద్