లీకేజీ సూత్రధారి అరెస్టు.. పుణె కెమిస్ట్రీ లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
నీట్-యూజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణలపై పుణెకు చెందిన ఒక కెమిస్ట్రీ లెక్చరర్ని సీబీఐ అరెస్టు చేసింది.
- రహస్య ట్యూషన్ క్లాసులో ప్రశ్నపత్రం లీకేజీ
- నిందితుడు పేపర్ సెట్ చేసే ఎన్టీఏ ప్యానెల్ సభ్యుడు
న్యూఢిల్లీ, మే 15: నీట్-యూజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణలపై పుణెకు చెందిన ఒక కెమిస్ట్రీ లెక్చరర్ని సీబీఐ అరెస్టు చేసింది. ఒక రహస్య ట్యూషన్ సెషన్లో ఆ లెక్చరర్ పలువురు అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు సీబీఐ పేర్కొన్నది. పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తరఫున నిందితుడు పీవీ కులకర్ణికి పరీక్ష ప్రక్రియతో సంబంధం ఉందని సీబీఐ తెలిపింది.
రిటైర్డ్ కాలేజీ ప్రొఫెసర్ అయిన కులకర్ణిని ప్రశ్నించేందుకు సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ చివరి వారంలో పుణెలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన రహస్య కోచింగ్ సెషన్లో కులకర్ణి, ఈ కేసులోని మరో నిందితుడి సహాయంతో నీట్-యూజీ అభ్యర్థుల బృందానికి ప్రశ్నపత్రాలను, సరైన సమాధానాలను లీక్ చేసినట్లు సీబీఐ పేర్కొన్నది. కులకర్ణికి సహకరించిన మనీషా మాఘ్మారేను సీబీఐ అరెస్టు చేసింది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

