న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) 2022షెడ్యూల్ త్వరలో విడుదలకానుంది. ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించే అవకాశం ఉన్నదని సమాచారం. నీట్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వర్గాలు తెలిపాయి. మే 7 వరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని, కరెక్షన్స్కు ఐదు రోజులపాటు అవకాశం ఉంటుంద అధికారులు తెలిపారు.
కాగా, ఈ ఏడాది నుంచి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో 17 ఏండ్లు నిండిన, ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు చదివినవారు నీట్ దరఖాస్తు చేసుకోచ్చు. దేశవ్యాప్తంగా ఇంగ్లిష్, హిందీ, ఉర్దూతోపాటు స్థానిక భాషలైన తెలుగు, తమిళం, అస్సామీ, బెంగాలి, గుజరాతి, కన్నడ, మరాఠి, మలయాళం, ఒడియా, పంజాబీలో పెన్, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు విడుదల చేసే అవకాశం ఉన్నది.
వెబ్సైట్: www.nta.ac.in