Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంపీఈడీ పరీక్షా ఫలితాలను విడుదలయ్యాయి. ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
ఓయూ ఫిజిక్స్ విభాగం హెడ్ గా ప్రొఫెసర్ ప్రసాద్
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం హెడ్‌గా ప్రొఫెసర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని ఓయూ వీసీ చేతుల మీదుగా ప్రొఫెసర్ ప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, అధికారులు, పరిశోధిక విద్యార్థులు అభినందించారు.