
ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్సైట్లోకి వెళతాం. అందులో రంగురంగులతో కొనాలనుకున్న వస్తువులన్నీ ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. ఇలా కనపడుతూ ఇంటరాక్ట్ అవడానికి వీలు కల్పించే దానిని ఫ్రంట్ ఎండ్ అంటారు.ఓలా, ఉబెర్ లాంటి అప్లికేషన్స్ తరచూ వాడుతుంటాం. అందులో రైడ్‌కు పెట్టుకున్న రిక్వెస్ట్ దగ్గరలో ఉన్న డ్రైవర్స్‌కు వెళ్తుంది. అలాగే డ్రైవర్ రిక్వెస్ట్ అంగీకరించగానే వివరాలు ఒక నోటిఫికేషన్లో వస్తాయి. ఇలా జరగడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తారు. సాఫ్ట్వేర్ సర్వర్‌లో రన్ అవుతుంది. సర్వర్ అంటే ఒక కంప్యూటర్ లాగా పనిచేసే టెక్నాలజీ. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడాన్ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌లో చాలా టెక్నాలజీలు, ఫ్రేమ్‌వర్క్ ఉపయోగిస్తారు.
కంపెనీలు ఏం ఆలోచిస్తాయి?
ఈ రోజుల్లో అప్లికేషన్స్ అనేవి చాలా వేగంగా తయారు చేయడం తప్ప వేరే మార్గం లేదు. అంత వేగంగా అప్లికేషన్స్ తయారు చేయాలంటే డెవలపర్ ఉపయోగించే టెక్నాలజీలు కూడా ముఖ్యం. అవి చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి ఉండాలి. వాటితో వేగంగా అప్లికేషన్స్‌ని తయారు చేయగలగాలి. వెబ్సైట్ లేదా యాప్‌ని కొన్ని లక్షల మంది వాడుతారు. అంతమంది వాడుతున్నా ఆ అప్లికేషన్ తట్టుకునేలా టెక్నాలజీలను ఎంచుకోవాలి. ఇలా ఆలోచించి ప్రతి కంపెనీ తమకంటూ ఒక ‘టెక్ స్టాక్’ని ఎంచుకుంటుంది.
స్టాక్ అంటే ఏంటి?
అమెజాన్, ఫేస్బుక్ వంటి ప్రతి సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయడానికి వివిధ టెక్నాలజీలు ఉపయోగిస్తారు. ఇలా వెబ్‌సైట్స్, అప్లికేషన్ అభివృద్ధి చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల టెక్నాలజీలను, ఫ్రేమ్‌వర్క్‌ని కలిపి టెక్నాలజీ స్టాక్ అంటారు. ఈ స్టాక్‌లన్నీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీల్లో విభజిస్తారు.
MERN స్టాక్, MEAN స్టాక్, MEVN స్టాక్, JAM స్టాక్ ఇలా చాలా స్టాక్‌లు ఉన్నాయి. సాఫ్ట్వేర్ తయారు చేసే అవసరాలను బట్టి స్టాక్, అందులో టెక్నాలజీలు కూడా మారుతుంటాయి. తయారుచేసే సాఫ్ట్వేర్స్ ఇంటరాక్టివ్‌గా ఉండాలంటే ఉపయోగించే స్టాక్ అనేది చాలా ముఖ్యం. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఎక్కువగా వాడేది MERN స్టాక్. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మరెన్నో కంపెనీలు కూడా ఈ MERN స్టాక్‌లోని టెక్నాలజీను ఉపయోగిస్తున్నాయి.
MERN స్టాక్ అంటే?
MERN స్టాక్ అనేది ఒక వెబ్ డెవలప్మెంట్ స్టాక్. Mongo DB, Express JS, React JS, and Node JS నాలుగు కీలక టెక్నాలజీలు. ఈ MERN స్టాక్‌లోని టెక్నాలజీలు వెబ్ అప్లికేషన్ డెవప్మెంట్ని సులభంగా చేయడానికి రూపొందించారు.
ఒక అప్లికేషన్ని తయారు చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి. MERN స్టాక్‌లో Java Script లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తారు. అమెజాన్, ఫేస్బుక్ వంటి వాటిల్లో ఈ-మెయిల్, ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ అవుతుంటాం. ఇవన్నీ డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి. ఈ డేటాబేస్‌ని మేనేజ్ చేయడానికి చాలా టెక్నాలజీలు ఉంటాయి. వాటిలో ఒకటి ఈ Mongo DB. బ్యాకెండ్ డెవలప్మెంట్లో ఉన్న వివిధ టెక్నాలజీల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవాటిలో Node JS ఒకటి. Express JS బ్యాకెండ్ డెవలప్మెంట్లో ఉపయోగించే ఒక ఫ్రేమ్‌వర్క్. Node JSతో బ్యాకెండ్ అప్లికేషన్లు రాయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ Express JS. React JS ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ప్రాచుర్యం పొందిన టెక్నాలజీ. దీన్ని ఫేస్బుక్ సంస్థ అభివృద్ధి చేసింది.
ఈ MERN స్టాక్ నేర్చుకునే ముందు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ పై పట్టు సాధించాలి. అలాగే HTML, CSS & Java Script నేర్చుకోవాలి.
ఎందుకు నేర్చుకోవాలి?
MERN స్టాక్‌లో ప్రధానంగా Java Scriptని ఉపయోగిస్తారు. దీనిని ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఎక్కువమంది వాడుతున్నారు. Java Script నేర్చుకోవడం చాలా సులభం. అలాగే అప్లికేషన్స్ కూడా చాలా వేగంగా తయారుచేయచ్చు. అందుకే ఇండస్ట్రీస్, కపెంపీల్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ Java script ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ రెండింటిలోనూ ఉపయోగిస్తారు. కాబట్టి MERN స్టాక్ నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గ్లాస్ డోర్ సమాచారం ప్రకారం ఇండియాలో ఈ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలపర్స్‌కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ప్రాథమిక స్థాయిలో ఈ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌ని నేర్చుకుంటే సంవత్సరానికి రూ.6 లక్షల వేతనం పొందవచ్చు. పే స్కేల్లోని సమాచారం ప్రకారం అమెరికాలో ఈ అప్లికేషన్ డెవలపర్స్‌కి మూల వేతనం $ 91,000 అంటే సుమారు రూ.66 లక్షలు.
CCBP టెక్ 4.0 ఇంటెన్సివ్ ప్రోగ్రాంతో కేవలం 4.5 నెలల్లోనే సంవత్సరానికి రూ.4.5 లక్షల నుంచి 9 లక్షల వేతనంతో ఉద్యోగం తెచ్చుకోవచ్చు.
ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవడానికి కోడింగ్ పై ఎటువంటి అవగాహన అవసరం లేదు. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రోగ్రాం గురించి ccbp.in/intensive వెబ్సైట్లో చూడవచ్చు. 9390111765 నంబర్‌కి వాట్సాప్ లో మెసేజ్ చేయవచ్చు లేదా support@nxtwave.techకి మెయిల్ పంపవచ్చు.
రాహుల్ అత్తలూరి
సీఈఓ, నెక్ట్స్‌వేవ్