ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ, నాబార్డ్ వంటి బ్యాంకు పరీక్షలకు ప్రిపేరయ్యేవారు కంప్యూటర్స్ విభాగం ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందాం. ఈ విభాగం కేవలం మెయిన్స్‌లో మాత్రమే వస్తుంది. ఇది సాధారణంగా రీజనింగ్ విభాగంతో కలిసి 15-20 ప్రశ్నలకు ఈ సెక్షన్ వస్తుంది. ఈ విభాగం అభ్యర్థికి ఉన్న కంప్యూటర్స్ బేసిక్స్, కాన్సెప్ట్‌పై అవగాహన తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వివిధ బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు కంప్యూటర్ అవేర్నెస్ విభాగంపై పూర్తి అవగాహన ఉంటే ఈ సెక్షన్లో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ నేపథ్యంలో కంప్యూటర్స్ నాలెడ్జ్ పేపర్‌కు ఎలా ప్రిపేర్ కావాలి, సిలబస్, పరీక్ష స్వరూపం, ఎలాంటి అంశాలు ముఖ్యమైనవి వంటి వాటి గురించి తెలుసుకుందాం.
ఈ విభాగం మార్కులు పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని గ్రహించాలి. ఈ పేపర్లో ప్రాథమిక స్థాయి కంప్యూటర్ అవేర్నెస్తో పాటు స్టాండర్డ్ లెవల్లో కూడా ప్రిపేర్ కావాలి.
స్కోరింగ్ సబ్జెక్టుల్లో కంప్యూటర్స్ సెక్షన్ ఒకటి. మెయిన్స్‌లో అడిగే కంప్యూటర్స్ ప్రశ్నలు కొన్ని సులభంగా, కొన్ని కఠినంగా ఉంటాయి. దీనిలో కంప్యూటర్స్ ప్రాథమిక నిబంధనలు, సంక్షిప్తాలు, బ్యాంకింగ్‌లో కంప్యూటర్స్ ఫంక్షనాలిటీ అంశాలు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలి. వీటిపై మెయిన్స్‌లో మెజారిటీ ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి.
ముఖ్యమైన అంశాలు
1) కంప్యూటర్స్ హిస్టరీ, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్
2) కంప్యూటర్ మెమరీ, మెమరీ పరికరాలపై గమనికలు
3) కంప్యూటర్ స్టోరేజ్ యూనిట్
4) నెట్వర్కింగ్, రకాలు-అంశాలు
5) ఆపరేటింగ్ సిస్టమ్స్, రకాలు, వాటి విధులు
6) కంప్యూటర్ సాఫ్ట్వేర్
7) హార్డ్‌వేర్-IO పరికరాలు
8) కంప్యూటర్స్ హ్యాకింగ్
9) వివిధ రకాల వైరస్లు
10) ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ మొదలైనవి
11) డాటా బేస్ మేనేజ్మెంట్
12) ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
13) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
14) సంక్షిప్తాలు
రిఫరెన్స్ బుక్స్
కిరణ్ ప్రకాశన్- ఆబ్జెక్టివ్ కంప్యూటర్ నాలెడ్జ్
అరిహంత్ పబ్లికేషన్- కంప్యూటర్స్ అవేర్నెస్
దిశ పబ్లికేషన్- కంప్యూటర్ నాలెడ్జ్
సౌమ్యరంజన్ బెహ్రా- ఆబ్జెక్టివ్ విత్ సబ్జెక్టివ్ ఇన్ కంప్యూటర్స్
ఎస్. మధుకిరణ్
డైరెక్టర్, ఫోకస్ అకాడమీ
హైదరాబాద్
9030496929