హైదరాబాద్: ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో దంతవైద్య కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. నీట్-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు రిజిర్స్టేషన్ చేసుకోవచ్చు. వివరాలకు www.knruhs.telangana. gov.in చూడాలని వర్సిటీ సూచించింది.