e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News హైద‌రాబాద్ డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్‌లు

హైద‌రాబాద్ డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్‌లు

హైద‌రాబాద్ డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్‌లు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేస్తున్న‌ది. ఇందులో మొత్తం 10 ఖాళీలున్నాయి. ఆఫ్‌లైన్ అప్లికేష‌న్ల‌ను వ‌చ్చేనెల 14లోపు పంపించాలి.
మొత్తం ఖాళీలు: 10
ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 7, ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుకు మెకానికల్ ఇంజనీరింగ్‌, ఏరోనాటికల్ పోస్టుకు సంబంధిత‌ బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణ‌త సాధించాలి. గేట్ స్కోర్ తప్పనిసరి. అభ్య‌ర్థులు 28 ఏండ్ల‌లోపువారై ఉండాలి.
వేతనం: రూ.31,000
ద‌ర‌ఖాస్తు విధానం: నిర్ణీత న‌మూనాలో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తిగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సంబంధిత అడ్ర‌స్‌కు పోస్టులో పంపించాలి.
అడ్రస్: The Director, DRDL, Dr. APJ Abdul Kalam Missile Complex, Kanchanbagh PO, Hyderabad – 500058
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 14
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హైద‌రాబాద్ డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్‌లు

ట్రెండింగ్‌

Advertisement