JNTU : కొలువులిచ్చే కొత్త కోర్సులు.. ఈ ఏడాది కొత్తగా 6 కోర్సులు ప్రారంభం
JNTU courses : ఏటేటా సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్నది. దీనికి తగ్గట్టుగా ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులొస్తున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది జేఎన్టీయూ పరిధిలో కొత్తగా ఆరు కోర్సులను ప్రవేశపెట్టారు. బీటెక్ సీఎస్ఈ గ్రూప్‌వారికి ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో కొత్త కోర్సులపై ప్రత్యేక కథనం.

మెషిన్ లర్నింగ్
గత అనుభవాల ఆధారంగా పనిచేయడమే మెషిన్‌లర్నింగ్. ఐఫోన్‌లోని ఫేస్ రికగ్నిషన్ యాప్‌కు ఈ టెక్నాలజీయే అధారం. జీ మెయిల్లో ఇన్‌బాక్స్, స్పామ్లుంటాయి. ఒక్కోసారి కొన్ని మెయిల్స్ వాటంతటవే స్పామ్‌లోకి వెళ్తుంటాయి. మనం గతంలో ఏదైనా ఒక ఐడీ నుంచి వచ్చిన మెయిల్‌ను స్పామ్‌లోకి పంపించి ఉంటే, అదే ఐడీ నుంచి వచ్చిన మెయిల్స్ అన్నీ వాటంతటవే స్పామ్‌లోకి వెళ్తుంటాయి. కారణం.. మెషిన్ లర్నింగ్. ఇందులో సూపర్వైజ్డ్, ఆన్సూపర్వైజ్డ్, రీయిన్‌ఫోర్స్‌మెంట్ అనే అల్గారిథమ్స్ ఉంటాయి.
కెరియర్ అవకాశాలు
- ఆమెజాన్, ఆపిల్, ఆటోడెస్క్, నైకి, ఫేస్బుక్ తదితర కంపెనీల్లో ఉద్యోగాలు.
- ఫ్రెషర్స్‌కు ఏడాదికి రూ.3 లక్షల వేతన ప్యాకేజీ.. రెండుమూడేండ్ల అనుభవం ఉంటే రూ.6 లక్షల నుంచి 8 లక్షలకుపైగా..

మెకట్రానిక్స్
ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌ల కలయికే మెకట్రానిక్స్. రోబోటిక్స్, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్, సిస్టమ్స్ కంట్రో ల్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్‌తో కూడిన మెకట్రానిక్స్ను ఇటీవల ఐఐటీల్లో ఒక కోర్సుగా ప్రవేశపెట్టా రు. రోబోటిక్స్, నానోటెక్నాలజీ సిస్టంలలో మెకట్రానిక్స్ ను అధికంగా వినియోగిస్తున్నారు. దీంట్లో ఇంజినీరింగ్ కెమిస్ట్రీ, గణితం, టెక్నికల్ కమ్యూనికేషన్స్, డిజైన్ మెషిన్ ఎలిమెంట్స్, ఫ్యాక్టరీ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ తదితర విభాగాలుంటాయి.
ఉద్యోగాలు
- మెకట్రానిక్స్ ఇంజినీర్, డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇంజినీర్, ఆటోమేషన్ ఇంజినీర్, ఎలక్ట్రో మెకానికల్ ఇంజినీర్.
- హ్యుందాయ్ మోటర్స్, రాయల్ ఎన్ఫీల్డ్, అశోక్‌లేలాండ్ తదితర వాహన తయారీ రంగ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు.

కోడింగ్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఇప్పుడు అన్ని రంగాల్లో కోడింగ్ టెక్నాలజీదే అధిపత్యం. ఒక ప్రోగ్రాంను రాసిస్తే కంప్యూటర్ ఆధారంగా స్వయంసిద్ధంగా పనిచేయడమే కోడింగ్. ఏదైనా టికెట్ బుక్ చేయగానే ఎస్సెమ్మెస్ వస్తుంది. ఇది మనుషులు టైప్చేసేది కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాధ్యమవుతున్నది. ఇందులో విత్ కోడింగ్, వితౌట్ కోడింగ్ అనే రెండు కోర్సులున్నాయి. సొంతంగా ఆలోచించడం, మనిషి మాదిరిగా ఆలోచించడం, మనిషి మాదిరిగా పనిచేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐఐటీ హైదరాబాద్ సహా పలు దిగ్గజ సంస్థలు బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. టెస్లా కంపెనీ తమ కార్లల్లో ఏఐని వినియోగించింది.
కెరియర్ అవకాశాలు
- కంప్యూటర్ విజన్ ఇంజినీర్, డాటా అనలిస్ట్, రిసెర్చ్ ఇంజినీర్, డాటా సైంటిస్ట్, బిగ్‌డాటా ఆర్కిటెక్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, మెషిన్ లర్నింగ్ ఇంజినీర్, రోబోటిక్ ప్రోగ్రామర్, వీడియోగేమ్ ప్రోగ్రామర్, అల్గారిథమ్ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలు.
- ఎంపికైనవారికి ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.18 లక్షల ప్యాకేజీలిస్తున్నారు.

సైబర్ సెక్యూరిటీ
సైబర్ నేరగాళ్ల సాంకేతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యమే సైబర్ సెక్యూరిటీ. ఆన్లైన్, ఈ-కామర్స్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
కెరియర్ అవకాశాలు
సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఇంజినీర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా ఉద్యోగావకాశాలు.

ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌ల కలబోతగా ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ. ఒక యంత్రాన్ని డిజైన్ చేసి, నిర్మించి, మనిషి అవసరంలేకుండా దానిని నిర్వహించడమే ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ ప్రత్యేకత. దీని సహాయంతో వేల సంఖ్యలో వచ్చే ఈ మెయిల్స్‌కు మనుషుల అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా రిైప్లె ఇవ్వడం సాధ్యమవుతున్నది. నిర్దేశిత ప్రొగ్రాం రాసి నిక్షిప్తం చేస్తే దానికదే పనిచేస్తుంది. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌ను బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, తయారీరంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఐటీసెక్టార్తోటు నిత్యజీవితంలో ఇది ఉపయోగపడుతున్నది. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ రాకతో భవిష్యత్తులో బీపీవో, కేపీవో సర్వీసెస్ అవసరం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కెరియర్ అవకాశాలు
- స్పేస్ రిసెర్చ్, మెడికల్, ఎంటర్టైన్మెంట్, ఇన్వెస్టిగేషన్, బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
- రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ డెవలపర్, ఎంబెడెడ్ సిస్టం ఇంజినీర్, ఆటోమేషన్ రోబోటిక్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలు.
- ఏడాదికి కనీసం రూ.4.5 లక్షల నుంచి 12 లక్షల వరకు వేతనాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మనకు ‘రా’ ఇంటెలిజెన్స్.. మరి పాక్, చైనా దేశాల నిఘా సంస్థల గురించి తెలుసా?
ఇంగ్లిష్‌లో మాట్లాడుదాం అలవోకగా
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

