గురువారం 29 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 18, 2020 , 15:05:20

జ‌మ్ములో మొద‌టిసారిగా నాలుగు కేంద్రాల్లో జేఈఈ

జ‌మ్ములో మొద‌టిసారిగా నాలుగు కేంద్రాల్లో జేఈఈ

న్యూఢిల్లీ: ‌కేంద్ర‌పాలిత ప్రాంతంగా మారిన త‌ర్వాత‌ జ‌మ్ముక‌శ్మీర్‌లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే 24 గంట‌ల కరెంటు అందుబాటులోకి వ‌స్తుండ‌గా, విద్యా రంగంలో కూడా చెప్పుకోద‌గిన స్థాయిలో మార్పులు వ‌స్తున్నాయి. జాతీయ‌స్థాయి ప్ర‌వేశ‌ప‌రీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను జ‌మ్ముక‌శ్మీర్‌లో మొద‌టిసారిగా నాలుగు కేంద్రాల్లో నిర్వ‌హిస్తున్నారు. 

ఈమేర‌కు నాలుగు కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఐఐటీ ఢిల్లీ డైరెక్ట‌ర్ వీ రామ్‌గోపాల్ రావు ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. జ‌మ్ములో ఇప్ప‌టివ‌ర‌కు ఒకే ఒక్క కేంద్రంలో జేఈఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని, మొద‌టిసారిగా శ్రీన‌గ‌ర్‌, జ‌మ్ము, క‌శ్మీర్‌లో నాలుగు కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్షను దేశ‌వ్యాప్తంగా ఈనెల 27 నుంచి నిర్వ‌హించ‌నున్నారు.   


logo