ఐటీ డిపార్ట్మెంట్లో ఎంటీఎస్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఐటీ డిపార్ట్మెంట్| ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150కిపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150కిపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎంటీఎస్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్‌కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇవి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
మొత్తం పోస్టులు: 155
ఇందులో ఎంటీఎస్ 64, ట్యాక్స్ అసిస్టెంట్ 83, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎంటీఎస్ పోస్టుకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో, యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లు, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జట్టులో సభ్యుడై జాతీయ క్రీడల్లో ఏదో ఒకటి పాల్గొని ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నవారై ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత అవసరమైతే ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
వెబ్సైట్: incometaxmumbai.gov.in
ఇవి కూడా చదవండి..
మ్యూజియంగా మారనున్న దిలీప్ కుమార్ పూర్వీకుల ఇల్లు..!
బయటపడిన మరో భారీ డైమండ్.. ఎంత పెద్దదో తెలుసా?
తండ్రి బాటలో తనయుడు.. 30 ఏళ్ల తర్వాత అదే శాఖ చేపట్టిన సింధియా
ఆరోగ్యశాఖమంత్రిగా మన్సుక్ మాండవీయ.. ఇదీ ఆయన ప్రొఫైల్
పారిస్‌లోని 200 కోట్ల విలువైన భారత ఆస్తులు సీజ్..
ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కొవిడ్ మరణాలు : డబ్ల్యూహెచ్‌వో
కొత్తగా 45,892 కరోనా పాజిటివ్ కేసులు..
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

