పారిస్‌లోని 200 కోట్ల విలువైన భారత ఆస్తులు సీజ్..

న్యూఢిల్లీ: పారిస్‌లో ఉన్న భారతీయ ఆస్తులను స్కాట్లాండ్కు చెందిన కెయిన్ ఎనర్జీ సంస్థ జప్తు చేయనున్నది. ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేరకు సుమారు 20 ప్రాపర్టీలను ఆ సంస్థ స్వాధీనం చేసుకోనున్నది. ఆ ప్రాపర్టీల విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓ కేసు విషయంలో సెటిల్మెంట్లో భాగంగా ఈ సీజ్ మొదలైనట్లు తెలుస్తోంది.
కెయిన్ ఎనర్జీ సంస్థ దాఖలు చేసిన ఓ కేసులో.. అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టు భారత్‌కు 1.2 బిలియన్ల డాలర్ల జరిమానా విధించింది. దానిలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ఆస్తులను ఆ కంపెనీ స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారతీయ ప్రాపర్టీలను అమ్మడం వల్ల వచ్చే ఆదాయం కెయిన్ సంస్థకు వెళ్తుందని ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది.
2014లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించినట్లు ట్రిబ్యునల్ పేర్కొన్నది. ఈ విషయంపై గతంలో ఆ సంస్థ పలు దేశాల్లో భారత్‌పై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

