హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు బుధవారం వెల్లడయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతలమీదుగా ఫలితాల విడుదలకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలకు మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హా జరయ్యారు. మూల్యాంకన ప్రక్రియ ఎప్పు డో ముగిసినప్పటికీ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించకపోవడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమైంది.