బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nipuna-education - Sep 16, 2020 , 14:15:32

వ‌చ్చేనెల 18న ఐఐఎంసీ ప్ర‌వేశ ప‌రీక్ష

వ‌చ్చేనెల 18న ఐఐఎంసీ ప్ర‌వేశ ప‌రీక్ష

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ క‌మ్యూనికేష‌న్ (ఐఐఎంసీ) ప్ర‌వేశ ప‌రీక్ష తేదీని నేష‌న్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్ర‌క‌టించింది. ఐఐఎంసీ ప‌రీక్ష‌ను వ‌చ్చే 18న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. అభ్య‌ర్థులు ప‌రీక్ష‌ను ఇంటివ‌ద్ద నుంచే ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో రాసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 

ఐఐఎంసీ ఇప్ప‌టికే ఎనిమిది పీజీ డిప్లొమా కోర్సుల‌ ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. ఈ నెల 23 వ‌ర‌కు  iimc.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని వెల్లడించింది. 

ప‌రీక్ష‌ల వివ‌రాలు

పీజీ డిప్లొమా ఇన్ జ‌ర్న‌లిజం (హిందీ), పీజీ డిప్లొమా ఇన్ జ‌ర్న‌లిజం (ఇంగ్లిష్‌)- 10 గంట‌ల నుంచి 11.30 వ‌ర‌కు

పీజీ డిప్లొమా ఇన్ రేడియో అండ్ టెలివిజ‌న్ జ‌న‌ర్న‌లిజం- మ‌ధ్యాహ్నం 12.15 నుంచి 1.45 వ‌ర‌కు

పీజీ డిప్లొమా ఇన్ అడ్వ‌ర్ట‌యిజింగ్ అండ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్- మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు

పీజీ డిప్లొమా ఇన్ జ‌ర్న‌లిజం (ఉర్దూ, ఒడియా, మ‌రాఠీ, మ‌ల‌యాళం)- సాయంత్రం 5 నుంచి 6.30 వ‌ర‌కు


logo