OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో జి. ఝాన్సీ డాక్టరేట్ సాధించారు. డాక్టర్ ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో ఎలక్ట్రికల్ స్టడీస్ ఆన్ ఇంటర్ గ్రోత్ ఆఫ్ ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి ఝాన్సీ సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆమెకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట ఎన్టీఆర్ నగర్ కు చెందిన జి.ఝాన్సీ తన పరిశోధన పూర్తిచేసే క్రమంలో రూపొందించిన పలు పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లలో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధ్యాపకులు, అధికారులు అభినందించారు.