కొడంగల్, జూన్ 06: రంగారెడ్డి-హైదరాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు (Gurukula Admissions) అవకాశం ఉన్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, కొడంగల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం పదో తరగతిలో ఉత్తీర్ణులైన గిరిజన బాలురకు ఈనెల 10న ఉదయం 11 గంటలకు TGTWREIS పాత కొడంగల్, చెరువు కట్ట దగ్గర ఉన్న కాలేజీలో కౌన్సిలింగ్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు టీవీ, పదో తరగతి మార్కుల మెమో, స్టడీ, కండక్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలు పంట తీసుకురావాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.2 లక్షలకు మించరాదని సూచించారు. అదేవిధంగా ఆధార్ జిరాక్స్, స్పోర్ట్స్, ఆర్ఫన్, PHC ధృవీకరణ పత్రాలు, కలర్ ఫోటోలు, రెండు జతల జిరాక్స్ కాపీలుతో హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం పొందాలనుకున్న బాలురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గిరిజన విద్యార్థి అభ్యర్థులను మాత్రమే తీసుకొనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 8333925370 నంబర్లో సంప్రదించాలన్నారు.