గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది ఉప వివరణలను చదవండి?
ఎ) మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను 1999లో అధికారికంగా ప్రకటించారు
బి) సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం సంప్రదాయకంగా సమర్పించే నైవేధ్యంగా వాడతారు
కింది ఐచ్చికాల నుంచి సరైన జవాబును ఎంపిక చేయండి?
1) ఎ, బి రెండూ సరైనవే
2) ఎ, బి రెండూ సరికాదు
3) ఎ 4) బి
2. కింది వాటిలో దేన్ని శ్రీ పర్వతం అని పిలుస్తారు?
1) అమరావతి నుంచి నాగార్జున కొండ వరకు ఉన్న పర్వతం
2) నాగార్జున కొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం
3) నాగార్జున కొండ మాత్రమే
4) శ్రీశైలం కొండ మాత్రమే
3. కింది వాటిని జతపరచండి?
తెలంగాణ వాటి అర్థాలు మాండలికం
ఎ) అంగి 1) అవసరం
బి) అక్కెర 2) చొక్కా
సి) అమాలి 3) సంతకం
డి) దస్తకత్ 4) కూలి
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-1, సి-4, డి-2
4. కింది వాటిని జతపరచండి?
ఎ) రి సైండర్ హైదరాబాద్ 1) టి. ఉదయవర్లు 1) ఎ-1, బి-3, సి-4, డి-2
బి) నమస్తే హైదరాబాద్ 2) డా. ఎం.ఎ. నయిమ్ 2) ఎ-2, బి-4, సి-3, డి-1
సి) సలాం హైదరాబాద్ 3) దాశరథి రంగాచార్య 3) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) మోదుగు పూలు 4) పరావస్తు లోకేశ్వర్ 4) ఎ-3, బి-1, సి-2, డి-4
5. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో (1969) కింది వాటిలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా ఏది?
1) పాతకాపు 2) ఆదర్శం
3) సప్త స్వరాలు 4) రైతు బిడ్డ
6. ‘బస్తీ’ అనే పదం గురించి కింది వాటిలో ఏది సరైనది?
ఎ) జైన వసతి పదం బసతిగా మారీ బస్తీ అయింది
బి) బస్తీ అనేది ఉర్దూ పదం
సి) ఈ పదం బౌద్ధంతో సంబంధం కలది
డి) బస్తీ అనేది ఒక తెలుగు పదం
కింది ఐచ్ఛికాల నుంచి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి?
1) ఎ 2) ఎ, బి 3) సి 4) డి
7. బోధన్ రాజులు వేయించిన శాసనాలకు గల పేరు?
1) బోధన్ 2) చోధన్
3) బాదన్ కుర్తి 4) బహుధాన్యపురం
8. గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు కలవు?
1) 78 2) 82 3) 87 4) 69
9. హైదరాబాద్‌లోని ఏ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి చేశాడు?
1) గోల్కొండ 2) చార్మినార్
3) మక్కామసీదు 4) ట్యాంక్ బండ్
10. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధ రేవు పట్టణం ?
1) పేరూరు 2) మోటుపల్లి
2) వాడపల్లి 4) మంథెన
11. గడి (కోట) అనే పదం ఏ భాషకు చెందినది?
1) తెలుగు 2) తమిళం
3) మరాఠీ 4) బెంగాళీ
12. ఫ్లోరా ఆఫ్ తెంగాణ అనే గ్రంథ రచయిత ఎవరు?
1) ఆచార్య రామయ్య
2) ఆచార్య రామనాథం
3) ఆచార్య పురుషోత్తం రెడ్డి
4) ఆచార్య టి. పుల్లయ్య
13. జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించినది ఎవరి కాలంలో?
1) శాతవాహనులు
2) వేముల వాడ చాళుక్యులు
3) కాకతీయులు
4) విష్ణుకుండినులు
14. హైదరాబాద్‌లో 1857 తిరుగుబాటుకు ఎవరు నేతృత్వం వహించారు?
1) మౌల్వి హుసైని
2) తుర్రేబాజ్ ఖాన్
3) ఖాసీం రజ్వీ
4) బడే గులాం ఖాన్
15. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని రాష్ర్టాలు/ ప్రాంతాలుగా ఏ రూపంలో విభజించారు?
1) ఆహారాలు 2) పహణీలు
3) క్షేత్రాలు 4) పాఠాలు
16. సాలేశ్వరం శిలా శాసనాన్ని ఎక్కడ కనుగొన్నారు?
1) తెనాలి-గుంటూరు
2) అమ్రాబాద్ మండలం-నాగర్ కర్నూల్
3) కీసర గుట్ట -మేడ్చల్ జిల్లా
4) కొండాపూర్ -సంగారెడ్డి
17. అన్ని పార్టీల సమావేశం తర్వాత తెలంగాణ మిగుళ్లను లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు?
1) వాంఛూ కమిటీ
2) ఫజల్ కమిటీ
3) కుమార్ లలిత్ కమిటీ
4) జగన్ మోహన్ రెడ్డి కమిటీ
18. శ్రీమతి ఇంధిరాగాంధీ ప్రతిపాధనలకు ప్రతిస్పందనగా తెలంగాణ పోరాట దినాన్ని ప్రకటించడంతోపాటు ఎన్జీవోలు వారి సమ్మెను ఏ తేదీన ప్రారంభించారు?
1) ఏప్రిల్ 12, 1969
2) ఏప్రిల్ 15, 1969
3) ఏప్రిల్ 16, 1969
4) ఏప్రిల్ 19, 1969
19. శాతవాహనుల కాలంలో ‘కోలికులు’ అంటే ఎవరు?
1) స్వర్ణ కారులు 2) బట్టలు నేసేవారు
3) వండ్రంగి పనివారు
4) చరిత్రకారులు
20. రాచకొండ, దేవరకొండ వెలమ ప్రభువులు అని చరిత్రకారులు ఎవరిని పిలుస్తారు?
1) వేములవాడ చాళుక్యులు
2) రేచర్ల పద్మనాయకులు
3) ముదిగొండ చాళుక్యులు
4) విష్ణుకుండినులు
21. కింది రచనలను వాటి రచయితలతో జతపరచండి?
ఎ) దాశరథి రాజనందన చరిత్ర 1) ఈదూరు ఎల్లన్న
బి) యయాతి చరిత్ర 2) మల్లారెడ్డి
సి) వైజయంతి విలాసం 3) సింగచార్యులు
డి) శివధర్మోత్తరం 4) సారంగు తమ్మయ్య
5) పొన్నెగంటి తెలగనార్యుడు
1) ఎ-3, బి-5, సి-4, డి-2 2) ఎ-5, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1 4) ఎ-4, బి-3, సి-1, డి-5
22. నిజాం కాలంలో ఎవరి ఆధ్వర్యంలో ఉమ్మడిగా దక్కన్ విమానయాన సంస్థ (దక్కన్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్)
ఏర్పడింది?
1) నిజాం ప్రభుత్వం- దకోటా ఎయిర్ లైన్స్
2) నిజాం ప్రభుత్వం –
విక్టోరియా ఎయిర్‌లైన్స్
3) నిజాం ప్రభుత్వం –
లుఫాన్స్ ఎయిర్‌లైన్స్
4) నిజాం ప్రభుత్వం -టాటా ఎయిర్‌లైన్స్
23. కింది ఆంధ్ర మహిళాసభ సమావేశం దాని అధ్యక్షురాలి పేర్లలో సరైంది కానిది ఏది?
1) మొదటి ఆంధ్ర మహిళా సభ
సమావేశం – నడిపల్లి సుందరమ్మ
2) మూడో ఆంధ్ర మహిళా సభ
సమావేశం – ఎల్లారెడ్డి ప్రగడ సీతాకుమారి
3) ఆరో ఆంధ్ర మహిళా సభ సమావేశం – సందగిరి ఇంద్రదేవి
4) తొమ్మిదో ఆంధ్ర మహిళా సభ
సమావేశం – మాడపాటి మాణిక్యమ్మ
24. కింది అంశాలను గమనించండి?
ఎ) అష్ట సూత్ర పథకం 1969లో
ప్రకటించారు
2) పంచసూత్ర పథకం 1971లో
ప్రకటించారు
3) పెసిడెన్షియల్ ఆర్డర్ (రాష్ట్రపతి
ఉత్తర్వులు) 1975లో జారీ చేశారు
4) 1986లో 610 జీవో జారీ అయింది
సరైన వాఖ్య(లు) ఐచ్చికాన్ని ఎంపిక చేయండి?
1) ఎ, సి 2) బి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
25. కింది వాటిలో ఏది టీజేఏసీ (తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ) నిర్వహించిన కార్యక్రమం కాదు?
1) సమరదీక్ష
2) ఢిల్లీ సంసద్ యాత్ర
3) పోరు గర్జన
4) సకల జన భేరి
26. శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రెటరీగా వ్యవహరించింది ఎవరు?
1) రణబీర్ సింగ్ 2) వి.కె. దుగ్గల్
3) రవీందర్ కౌర్
27. కింది బహిరంగ సభలను అవి జరిగిన ప్రదేశాలతో జతపరచండి?
ఎ) సింగూరు సింహగర్జన 1) సిరిసిల్ల 1) ఎ-1, బి-4, సి-3, డి-5
బి) ఓరుగల్లు వీర గర్జన 2) వరంగల్ 2) ఎ-3, బి-2, సి-4, డి-1
సి) కదనభేరి బహిరంగ సభ 3) నిజామాబాద్ 3) ఎ-4, బి-2, సి-1, డి-3
డి) ఇందూరు సింహగర్జన 4) సంగారెడ్డి 4) ఎ-4, బి-2, సి-5, డి-3
5) జనగామ
4) సజ్జన్ కుమార్
28. మొఘల్, రాజస్థానీ, జపానీ తోటలు కింది ఏ ప్రదేశంలో భాగంగా కనిపిస్తాయి?
1) గోల్కొండ కోట
2) ఫలక్‌నుమా ప్యాలెస్
3) చౌమహల్లా ప్యాలెస్
4) సైఘా సమాధులు
29. బతుకమ్మ పండగ ప్రారంభం చివరి రోజుల పేరు ఏమి?
1) వేపకాయల బతుకమ్మ ,
అట్ల బతుకమ్మ
2) నానుబియ్యం బతుకమ్మ,
వెన్నముద్దల బతుకమ్మ
3) అటుకుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ
4) ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ
30. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు సంబంధించి సరిగా జతపరచనిది ఏది?
1) ఐదో సిఫారసు : రాష్ర్టాన్ని రెండుగా విభజించడం, హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా చేయడం,
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని నిర్మించడం
2) రెండో సిఫారసు: రాష్ర్టాన్ని రెండుగా విభజించడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా
చేయడం
3) నాలుగో సిఫారసు: రాష్ర్టాన్ని ఐక్యంగా ఉంచడానికి యథాతథా స్థితిని కొనసాగించడం
4) మూడో సిఫారసు : రాయల తెలంగాణ, సీమాంద్రులను ఏర్పాటు చేయడం
31. మా తెలంగాణ అనే వార్తపత్రికను తీసుకువచ్చింది ఎవరు?
1) తెలంగాణ ప్రజా సమితి
2) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
3) తెలంగాణ జనసభ
4) తెలంగాణ ఫౌండేషన్
32. 1969 తెలంగాణ ఆందోళనను ఎవరు ప్రారంభించారు?
1) నల్లగొండ ఉపాధ్యాయులు
2) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు (కేటీపీఎస్)
3) ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు
4) రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు
33. తెలంగాణలోని ఏ కుల సమూహాలు గ్రామ దేవతల కథకులుగా సుపరిచితులు?
ఎ) అసాదిగ బి) చిందోలు
సి) ఎరుకుల డి) పంబాల
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, డి
34. తెలంగాణలో ‘బిండినీ వెట్టి వ్యవస్థకు సంబంధించి కింది వారిని పరిగణించండి?
ఎ) అది వేతన కార్మిక వ్యవస్థగా ఉండేది
బి) ఇది కట్టు బానిస వ్యవస్థగా ఉండేది
సి) ఈ వ్యవస్థలో నిమ్న కులాల వారిచేత భూస్వాములు వారి గృహాల్లో పనులు చేయించుకునేవారు
డి) ఈ వ్యవస్థలో కులాలవారీగా భూస్వాముల ద్వారా పూర్తి రక్షణ లభించేది
1) బి, సి
2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి
35. ఏ టెలివిజన్ చానల్ తెలంగాణ, ఆంధ్ర ఇరు ప్రాంతాల్లో ‘దశా దిశా’ అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని
నిర్వహించింది?
1) జీ-న్యూస్ 2) టీవీ-9
3) హెచ్ఎంటీవీ 4) టీ-న్యూస్
36. 1969 ఆందోళనలో 37 రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ ఎన్జీవో నాయకుడి పేరేమిటి?
1) బాకర్ అలీ మిర్జా
2) ఎం. నారాయణ రెడ్డి
3) కె.ఆర్. అమోస్
4) బి.వి.రాజు
