సైన్స్ అండ్ టెక్నాలజీ&ఎన్విరాన్మెంట్
1. పుష్పక్ గురించి కింది ప్రకటనలను పరిశీలించండి ?
a) పుష్పక్ అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పునర్వినియోగ ప్రయోగ వాహనం
b) ఇది పూర్తిగా పునర్వినియోగపరచదగిన సింగిల్-స్టేజ్-టు-ఆర్బిట్ (SSTO) రాకెట్‌గా రూపొందించారు
సరైన ప్రకటనను ఎంచుకోండి.
అ) a సరైనది ఆ) b సరైనది ఇ) a, b సరైనవి ఈ) ఏదీకాదు
2. భారతదేశం పాల్గొనే సైనిక విన్యాసాలను ఆయా దేశాలతో జతపరచండి.
సైనిక విన్యాసం అనుబంధ దేశం
a. డెజర్ట్ ఫ్లాగ్-VIII 1. యూఏఈ
b. షిన్యు మైత్రి 2. జపాన్
c. కోబ్రా వారియర్ 3. యూకే
d. DUSTLIK 4. ఉజ్బెకిస్థాన్
అ) a-1, b -2, c -3, d -4
ఆ) a-2, b -3, c -1, d -4
ఇ) a-3, b -2, c -4, d -1
ఈ) a-4, b -1, c -3, d -2
3. సముద్రయాన్ మిషన్ గురించి కింది ప్రకటనలను పరిశీలించండి.
a) సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు ముగ్గురు మనుషులను తీసుకెళ్లేందుకు స్వీయ చోదక మానవ సహిత సబ్మెర్సిబుల్ని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం
b) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) అనేది మిషన్ సముద్రయాన్.. నోడల్ మంత్రిత్వ శాఖ
c) మత్స్య 6000 అనేది ఖనిజ వనరులను అన్వేషించడానికి చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) అభివృద్ధి చేసిన మనుషులతో కూడిన సబ్మెర్సిబుల్ వాహనం
పై స్టేట్మెంట్లలో ఏవి సరైనవి?
అ) a ఆ) a, b ఇ) a, b, c సరైనవి ఈ) b, c
4. ‘ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్ (FTL)’ కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1. ఇది అటల్ టింకరింగ్ ల్యాబ్ అధునాతన వెర్షన్
2. FTLలకు మెటా నిధులు సమకూరుస్తుంది, అటల్ ఇన్నోవేషన్ మిషన్ నాలెడ్జ్ పార్టనర్‌గా ఉంటుంది
3. ఈ ల్యాబ్‌లను మెటా భాగస్వామి 1M1B (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) నిర్వహిస్తుంది
అ) 1 ఆ) 2 ఇ) 1, 2, 3 ఈ) ఏదీకాదు
5. వార్తల్లో తరచూ వినిపిస్తున్న ‘ఎరిథ్రిటాల్’ అంటే?
అ) యాంటీబయాటిక్ ఆ) కృత్రిమ స్వీట్నర్ (#)
ఇ) ఫుడ్ ప్రిజర్వేటివ్ ఈ) కలరింగ్ ఏజెంట్
6. ‘వైభవ్ ఫెలోషిప్ స్కీమ్’ గురించి కింది వాటిలో సరైనవి గుర్తించండి?
1. ఈ ఫెలోషిప్ భారతీయ పరిశోధకులకు విదేశాల్లోని పరిశోధనా సంస్థల్లో లేదా విద్యాసంస్థలతో కలిసి పనిచేయడానికి అవకాశాన్ని అందిస్తుంది
2. టాప్ 100 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్స్‌లో ర్యాంక్ పొందిన సంస్థలకు చెందిన పరిశోధకులు ఫెలోషిప్‌కు అర్హులు
3. ఈ ఫెలోషిప్ పథకం నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) పరిశోధకులకు భారతదేశంలోని వారికి నచ్చిన పరిశోధనా సంస్థ లేదా విద్యాసంస్థలో సంవత్సరానికి కనీసం ఒక నెల నుంచి గరిష్టంగా రెండు నెలల వరకు, మూడు సంవత్సరాలపాటు పని చేసే అవకాశాన్ని అందిస్తుంది
4. దరఖాస్తుదారు నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI), భారతీయ సంతతికి చెందిన వ్యక్తి (PIO) లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) అయి ఉండాలి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Ph.D/M.D/M.S డిగ్రీని పొంది ఉండాలి
అ) పైవన్నీ ఆ) 1, 2, 3 ఇ) 1, 2, 4 ఈ) 2, 3, 4
7. ‘ప్లానమ్ బోరియం’ గురించి సరైన వాటిని గుర్తించండి ?
1. ఇది కాలక్రమేణా స్థిరపడిన దుమ్ము, మంచు మిశ్రమం
2. అవి భూమి, మార్స్ ఉత్తర ధ్రువంలో కనిపించే పొరలు
3. ఇటీవల, యూరోపియన్ స్పేస్ క్రాఫ్ట్ ‘మార్స్ ఎక్స్‌ప్రెస్’
అంగారకుడి ఉత్తర ధ్రువంలో ప్లానమ్ బోరియంను కనుగొంది
అ) పైవన్నీ ఆ) 1, 2 ఇ) 2, 3 ఈ) 1, 3
8. హనుమాన్ గురించి కింది ప్రకటనల్లో సరైనది గుర్తించండి.
a) ఇది మల్టీమోడల్ AI సాధనం, 11 భారతీయ భాషల్లో టెక్ట్, స్పీచ్, వీడియోలను రూపొందించగలదు
b ) IIT బాంబే నేతృత్వంలోని BharatGPT సహకారంతో, సీతా మహాలక్ష్మి హెల్త్‌కేర్ (SML) 22 భారతీయ భాషలలో శిక్షణ పొందిన ఇండిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సూట్ ‘హనూమాన్’ను పరిచయం చేసింది
అ) a ఆ) b ఇ) రెండూ సరికాదు ఈ) రెండూ సరైనవే
9. INSAT-3DS గురించి సరైనవి ఏవి?
a) INSAT-3DS ఉపగ్రహం అనేది మూడో తరం భూస్థిర కక్ష్య వాతావరణ ఉపగ్రహం
b) ఈ మిషన్‌కు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) పూర్తిగా నిధులు సమకూరుస్తుంది.
c) ఈ మిషన్ పదేళ్లపాటు అంతరిక్షంలో పనిచేసేలా రూపొందించారు, పర్యావరణ పర్యవేక్షణ, సముద్ర పరిశీలన, వాతావరణ అంచనాలు, విపత్తు సహాయక చర్యలకు సహాయపడుతుంది
అ) a, b, c ఆ) a, c ఇ) b, c ఈ) a, b
10) YUva VIgyani KAryakram (YUVIKA)గురించి సరైన వాటిని గుర్తించండి.
a) యువ విద్యార్థులకు స్పేస్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ, స్పేస్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది
b) భారతదేశంలో 7 తరగతి చదువుతున్న విద్యార్థులు YUVIKA కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
c) దీన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నిర్వహిస్తుంది
d) ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేయాలని ప్రతిపాదించింది
e) ఎంపిక ప్రమాణాల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇచ్చింది
అ) పైవన్నీ ఆ) a, b, d, e
ఇ) a, b , c ,d ఈ) a ,c, d ,e
11. ఇటీవలి వార్తల్లోని ‘సంగం ఇనిషియేటివ్’ను ప్రారంభించిన శాఖ ?
అ) సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆ) జల శక్తి మంత్రిత్వ శాఖ
ఇ) విద్యా మంత్రిత్వ శాఖ ఈ) కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ
12. ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఎం87’ అంటే ఏమిటి ?
అ) న్యూట్రాన్ స్టార్ ఆ) బ్లాక్ హోల్
ఇ) బృహస్పతి అమావాస్య ఈ) గోల్డిలాక్స్ జోన్
13. ‘హై-ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ (HAPS)’ వాహనాలకు సంబంధించి కింది ప్రకటనల్లో సరైనవి ?
a) HAPS వాహనాలు సౌర పలకలను ఉపయోగించి సంప్రదాయ విమానాల కంటే చాలా ఎక్కువ ఎత్తులో పనిచేస్తాయి
b) ఉపగ్రహాలతో పోలిస్తే, HAPSని చౌకగా అమర్చవచ్చు, ఇది చాలా వేగంగా పని చేయగలదు, అత్యవసర అవసరాలకు అనుకూలంగా ఉంటుంది
c) ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్‌లతో పాటు, HAPS ప్రభావం కూడా జతచేరడం వల్ల వలస పక్షులపై వాటి ప్రభావం గురించి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
అ) a, b ఆ) పైవన్నీ ఇ) b , c ఈ) a
14. ‘జిగర్తాండ’ కింది వాటిలో దేనికి సంబంధించినది?
అ) భారతదేశపు మొదటి హైపర్ వెలాసిటీ విస్తరణ టన్నెల్ పరీక్ష సౌకర్యం
ఆ) ఇది సముద్ర అలల నుంచి శక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయగల వ్యవస్థ
ఇ) గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (TDF) కింద అభివృద్ధి చేయబడింది
ఈ) పైవేవీ కావు
15. ఇటీవల వార్తల్లో చూసిన టైడల్ డిస్ప్ష్రన్ ఈవెంట్ (TDE) గురించి కింది వాటిలో సరైనది ఏది?
అ) ఇది చంద్రుని ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తికి సంబంధించింది
ఆ) ఇది నక్షత్రాన్ని, బ్లాక్ హోల్ నాశనం చేయడానికి సంబంధించింది
ఇ) చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రం ద్వారా చెదిరిన సముద్రంలో ప్రవహించే అలల ప్రవాహం
ఈ) అత్యంత దట్టమైన న్యూట్రాన్ నక్షత్రాలు చాలా వేగంగా తిరుగుతూ సూర్యుని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని భంగపరచడం
16) INSAT-3DS ఉపగ్రహానికి సంబంధించి కింది ప్రకటనల్లో సరైన దాన్ని గుర్తించండి ?
అ) INSAT-3DS ఉపగ్రహం, ఇస్రో ప్రయోగించిన ప్రత్యేకమైన వాతావరణ ఉపగ్రహం
ఆ) దీన్ని జియోస్టేషనరీ ఆర్బిట్‌లోకి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఉపయోగించి ప్రయోగించారు
ఇ) ఇది ఇన్శాట్-3డి సిరీస్‌లో ఏడో విమానం
ఈ) పైవన్నీ
17) బ్రహ్మోస్ క్షిపణి గురించి కింది ప్రకటనల్లో సరైనవి ?
1. ఇది భూమి, సముద్రం, గాలి నుంచి ప్రయోగించే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి
2. మొదటి దశలో సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్ ఇంజిన్‌తో కూడిన రెండు-దశల క్షిపణి ఇది, దీనిలోని లిక్విడ్ రామ్‌జెట్ క్షిపణిని 3 మ్యాక్ స్పీడ్‌కు తీసుకెళ్లగలదు
3. ఇది భారతదేశం, రష్యాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా అభివృద్ధి చేయబడింది
4. దీనికి బ్రహ్మపుత్ర (భారతదేశం), రష్యాకు చెందిన (మాస్కో) నదుల పేరు పెట్టారు. దీని ప్రయోగ బరువు 2,200-3,000 కిలోలు
5. ఇది సూపర్సోనిక్ వేగంతో గరిష్టంగా 400 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించగలదు. ఇది ‘ఫైర్ అండ్ ఫర్గెట్స్’ సూత్రంపై పనిచేస్తుంది
6. ఇది 200 నుంచి 300 కిలోల బరువున్న సంప్రదాయ వార్‌హెడ్‌ను మోసుకెళ్లి, అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది
అ) పైవన్నీ ఆ) 2, 3,4, 6
ఇ) 1, 2, 3, 4, 6 ఈ) 2, 3, 4, 5
18) ఆర్యభట్ట-1, ఇటీవల వార్తల్లో కనిపించింది, కింది వాటిలో అది దేనికి సంబంధించినది?
అ) ఇది సౌర వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన భారతీయ ఉపగ్రహం
ఆ) ఇది 50 పెటాఫ్లాప్‌ల సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొత్త సూపర్ కంప్యూటర్
ఇ) ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యాప్‌లను మెరుగ్గా, వేగంగా పని చేయడానికి అనుమతించే చిప్సెట్
ఈ) ఇది కొత్త ఏరోసోల్, ఇది నిర్దిష్ట ప్రాంతాల్లో దోమల జనాభాను తగ్గించే లక్ష్యంతో ఉంది
19) మార్బర్గ్ వైరస్ వ్యాధికి సంబంధించి కింది ప్రకటనల్లో సరికానిది ?
1. మార్బర్గ్, ఎబోలా వైరస్ వ్యాధులు వైద్యపరంగా ఒకే రీతిలో ఉంటాయి
2. ఇది జూనోటిక్ వ్యాధి. చాలా అరుదుగా సంభవిస్తుంది, అధిక మరణాల రేటుతో వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది
అ) 1 ఆ) 2 ఇ) 1, 2 సరైనవి ఈ) ఏదీకాదు
20) LUX-ZEPLIN ప్రయోగం కింది వాటిలో దేనికి సంబంధించినది?
అ) డార్క్ మ్యాటర్ ఆ) భూమికి సమీపంలో ఉన్న వస్తువులు
ఇ) క్వాసార్స్ ఈ) బ్లాక్ హోల్స్
21. Monkeypoxకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి?
1. మంకీపాక్స్ వైరస్ DNA లాలాజలం, మూత్రం, మలం నమూనాల్లో ఉండదు
2. ఈ వైరస్ ఎక్కువగా లైంగిక సంపర్కం వల్ల వస్తుంది. ఎక్కువగా స్వలింగ సంపర్క పురుషులకు సంభవిస్తుంది
పై స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి?
అ) 1 ఆ) 2 ఇ) 1, 2 ఈ) 1, 2 కాదు
22. కింది వాటిలో ‘ఉగ్రం’ (Ugram) గురించి ఏది నిజం?
అ) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ‘ఉగ్రమ్’ అసాల్ట్ రైఫిల్‌ను తయారు చేసింది
ఆ) ‘ఉగ్రమ్’ అనేది 7.62 x 51 mm క్యాలిబర్ రైఫిల్ ఇది నాలుగు కిలోగ్రాముల కంటే తక్కువ బరువు, 500 మీటర్ల పరిధిని కలిగి ఉంటుంది
ఇ) ఈ రైఫిల్ సైనిక, పారామిలిటరీ, పోలీసుల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడింది
ఈ) పైవన్నీ
23. నీలగిరి తహర్కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది?
1. ఇది తమిళనాడు రాష్ట్ర జంతువు
2. నీలగిరి తహర్ IUCN స్థితి ప్రమాదంలో ఉంది
3. ఎరవికులం జాతీయ ఉద్యానవనం, నీలగిరి తహర్ల అత్యధిక సాంద్రత, అతిపెద్ద జనాభా కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది
సరైన స్టేట్మెంట్లను గుర్తించండి ?
అ) 1 ఆ) 2 ఇ) 1, 2 రెండూ ఈ) 1, 2 కాదు (#)
24. కింది ప్రకటనలను పరిశీలించండి?
1. శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40% సంచిత విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించడానికి భారతదేశం జాతీయంగా నిర్ణయించిన సహకార (Nationally Determined Contributions-NDC) లక్ష్యాలను సాధించింది
2. నవీకరించిన NDC సంస్థ స్థాపిత సామర్థ్యంలో శిలాజేతర ఇంధనాల వాటాను 40% నుంచి 50%కి పెంచింది
3. భారతదేశం నవీకరించిన NDCలను UNFCC COP27లో షర్మ్ ఎల్-షేక్ (ఈజిప్ట్)లో ప్రకటించింది
సరైన స్టేట్మెంట్లను గుర్తించండి.
అ) పైవన్నీ ఆ) 1, 2 ఇ) 2, 3 ఈ) 1, 3
25. అఫానసీ నికితిన్ సీమౌంట్ (AN సీమౌంట్) ఇటీవల వార్తల్లో కనిపించింది. అది కింది వాటిలో ఏ సముద్రంలో ఉంది?
అ) పసిఫిక్ మహాసముద్రం ఆ) ఆర్కిటిక్ మహాసముద్రం
ఇ) అట్లాంటిక్ మహాసముద్రం ఈ) హిందూ మహాస ముద్రం
– మల్లవరపు బాలలత సివిల్స్ ఫ్యాకల్టీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్
