హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగినట్టు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ఎన్రోల్మెంట్ పెరిగిందా? తగ్గిందా?
అనే శీర్షికన ప్రచురితమైన కథనం సత్యదూరమని ఖండించారు. 2024-25లో 26,29,488 ప్రవేశాలు పొందగా, 2025-26లో 26,52,162 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్టు తెలిపారు.