ఫ్యాషన్.. ఫ్యాషన్ ప్రపంచంలో ఎటుచూసినా చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుల వరకు అందరూ లేటెస్ట్ ఫ్యాషన్ కోసం తహతహలాడుతుంటారు. ప్రతిరోజు కొత్తగా కొంగొత్తగా ఉండాలనే తాపత్రయం పెరుగుతుంది. వేసుకునే దుస్తుల నుంచి పాదరక్షల వరకు, సెల్‌ఫోన్ పౌచ్, కీ చైన్లు ఇలా ప్రతివస్తువు అందంగా, సౌకర్యవంతంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే దీని వెనుక సృజనాత్మకత, నైపుణ్యత కలిగిన నిపుణుల కృషి అవసరం. సరిగ్గా అటువంటివారిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన సంస్థే నిఫ్ట్. ప్రస్తుతం యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. నిఫ్ట్‌కు సంబంధించిన సంక్షిప్త వివరాలు నిపుణ పాఠకుల కోసం..
నిఫ్ట్
కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ పరిధిలో 1986లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)ని ఏర్పాటుచేశారు. సౌందర్య, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో దీన్ని ప్రారంభించారు. దీనికోసం యూఎస్ఏలోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎఫ్ఐటీ) నుంచి స్కాలర్స్‌ను భాగస్వామ్యం చేశారు. ప్రస్తుతం దేశంలో 17 నిఫ్ట్ క్యాంపస్‌లు ఉన్నాయి.నిఫ్ట్- 2022 విద్యాసంవత్సరానికిగాను బీ.డిజైన్, బీ.ఎఫ్.టెక్నాలజీ, మాస్టర్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్
(బీ.డిజైన్)
యాక్సెసరీ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్
ఫ్యాషన్ డిజైన్
నిట్వేర్ డిజైన్
లెదర్ డిజైన్
టెక్స్టైల్ డిజైన్
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్ టెక్)
కాలవ్యవధి నాలుగేండ్లు
మాస్టర్ ప్రోగ్రామ్స్
డిజైన్
ఫ్యాషన్ మేనేజ్మెంట్
ఫ్యాషన్ టెక్నాలజీ
ఎవరు అర్హులు?
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌కు ఆగస్టు 1 నాటికి 24 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఇంటర్ లేదా 10+2 ఉత్తీర్ణత.
మాస్టర్ ప్రోగ్రామ్స్ (ఎం.డిజైన్, ఎం.ఎఫ్.ఎం, ఎం.ఎఫ్.టెక్నాలజీ)
ఎటువంటి వయోపరిమితి లేదు.
ఎం.డిజైన్ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ / ఎన్ఐడీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (కనీసం మూడేండ్లు) ఉత్తీర్ణత.
ఎం.ఎఫ్.ఎం ప్రోగ్రామ్: ఏదైనా డిగ్రీ
లేదా బీఈ/బీటెక్ లేదా బీ.ఎఫ్.టెక్నాలజీ కోర్సు
ఉత్తీర్ణత.
ఎంపిక విధానం
బీ డిజైన్
యూజీ డిజైన్ ప్రోగ్రామ్స్‌కు క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (క్యాట్), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (గ్యాట్), వీటిలో అర్హత సాధించి షార్ట్‌లిస్ట్ అయినవారికి సిచువేషన్ టెస్ట్ నిర్వహిస్తారు.
బీ.ఎఫ్.టెక్నాలజీ
యూజీ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌కు జనరల్ ఎబిలిటీ టెస్ట్ (గ్యాట్) నిర్వహిస్తారు.
ఎం డిజైన్
పీజీ డిజైన్ ప్రోగ్రామ్‌కు క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (క్యాట్), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (గ్యాట్)తో పాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఎం.ఎఫ్.ఎం
జనరల్ ఎబిలిటీ టెస్ట్ (గ్యాట్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎం.ఎఫ్.టెక్నాలజీ
జనరల్ ఎబిలిటీ టెస్ట్ (గ్యాట్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
నోట్: ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
పరీక్ష తేదీలు: యూజీ, పీజీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి పేపర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ) 2022, ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహిస్తారు.
నిఫ్ట్ క్యాంపస్‌లు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2022, జనవరి మొదటి వారం
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://nift.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ