హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్సెట్ తుది విడత కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. మంగళవారం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బుధవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఈ నెల 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 10లోపు సీట్లు కేటాయిస్తారు.