Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)లో మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సు (మూక్స్)ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా నిర్దేశిత సబ్జెక్టుల్లో నైపుణ్యాలు సాధించాలనుకునే వారి కోసం ఈ కోర్సులు ఉపయోగపడతాయి.
2025 జూలై నుంచి డిసెంబర్ వరకు నిర్వహించనున్న సెమిస్టర్‌కు గాను తొమ్మిది కోర్సులను ఆన్లైన్లో ప్రారంభిస్తున్నట్లు ఈఎంఆర్సీ ప్రకటించింది. ఇందులో ఎనిమిది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు కాగా, ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. అర్హతలతో సంబంధం లేకుండా ఆసక్తి గల అభ్యాసకులందరూ స్వయమ్ (SWAYAM) పోర్టల్ ద్వారా ఆగస్టు 31 వరకు పేర్లు నమోదు చేసుకుని కోర్సుల్లో చేరవచ్చని అధికారులు తెలిపారు. జూలై 7వ తేదీ నుంచి స్వయమ్ పోర్టల్ ద్వారా కోర్సులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తొమ్మిది కోర్సుల్లో అడ్మినిస్ట్రేటివ్ థియరీ, అగ్రేరియన్ సోషియాలజీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ కేస్ వర్క్, సోషల్ వెల్ఫేర్ అడ్మనిస్ట్రేషన్, సోషల్ వర్క్ రీసెర్చ్, అర్బన్ సోషియాలజీ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, ఎన్విరాన్ మెంటల్ సోషియాలజీ ల్లో సర్టిఫికెట్ కోర్సులో చేరాల్సిందిగా వివరించారు.