
క్రోమైట్
ఖమ్మం, భద్రాద్రిలో ఉపరితల ఖనిజంగా లభిస్తుంది
విస్తరించిన ప్రాంతాలు: గౌరారం, జన్నవరం, ఇమాన్నగర్, ఇంకూరు (ఖమ్మం)
అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా- ఖమ్మం
దేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం- ఒడిశా
బైరటీస్ (ముగ్గురాయి)
విస్తరించిన ప్రాంతాలు: రుద్రంకోట, వెంకటాయపాలెం, గోపాలపూర్, బాలాపేట్, చెరువుపురం (ఖమ్మం) బొల్లారం, వీరభద్ర దుర్గం (మహబూబ్నగర్)
దేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం-ఆంధ్రప్రదేశ్
మాంగనీస్
అధికంగా నిల్వ ఉన్న ప్రాంతాలు: తాంసి, మంచిర్యాల్, బెల్లంపల్లి
దేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం: మధ్యప్రదేశ్
సున్నపురాయి
రాష్ట్రంలో బొగ్గునిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో విస్తరించిన ఖనిజం
సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్లగొండ, సూర్యాపేట
సున్నపురాయి సిమెంట్ పరిశ్రమలకు ముడిఖనిజంగా పనిచేస్తుంది
బంకమట్టి
బంకమట్టి అధికంగా ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం
తక్కువ నాణ్యత గల కుండల తయారీకి ఉపయోగించే మట్టి తెల్లబంక మట్టి
పింగాణి పాత్రల తయారీకి ఉపయోగించే మట్టి విస్తరించిన ప్రాంతాలు- గోల్కొండకు పశ్చిమ ప్రాంతం
డోలమైట్
డోలమైట్ విస్తరించిన ప్రాంతాలు: రఘునాథపాలెం, మాదారం, మేములనరవా (ఖమ్మం)
అధికంగా నిల్వలు, ఉత్పత్తి చేస్తున్న జిల్లా: ఖమ్మం
దీని ఆధారిత పరిశ్రమలు: ఇనుము, ఉక్కు, ఫెర్రో అల్లాయ్, ఎరువులు, గాజు, పౌండ్రీ, కాస్మొటిక్స్
రాగి
లభించే ప్రాంతాలు: మైలారం ప్రాంతం (భద్రాద్రి కొత్తగూడెం)
దేశంలో రాగి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం- కర్నాటక
స్టియటైట్
విస్తరించిన ప్రాంతాలు: పోతారం, ఇస్రాజ్పల్లి, కొండాపురం (సంగారెడ్డి) లక్ష్మీదేవిపల్లి (సిద్దిపేట)
సోమశిల, కొల్లాపూర్ (నాగర్కర్నూల్) అమర్ఘా (మహబూబ్నగర్)
స్టియటైట్ ఆధారిత పరిశ్రమలు: పేపర్, రబ్బర్, సిరామిక్స్, సబ్బులు, డిటర్జెంట్స్, ఎరువులు
బొగ్గు
250 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ప్రకృతి ఉత్పాతాల వల్ల ఏర్పడిన బొగ్గు గోండ్వాన బొగ్గు
జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో గోండ్వానా బొగ్గు లభిస్తుంది
విస్తరించిన జిల్లాలు: ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రం భీం, ఆదిలాబాద్, నిర్మల్
రాష్ట్రంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా: ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం
దేశంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం- జార్ఖండ్
