అనువంశిక లక్షణాలు సంక్రమించే విధానాన్ని వివరించడానికి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం? 1) బీజ ద్రవ్య సిద్ధాంతం 2) పాన్జెనిసిన్ సిద్ధాంతం 3) దేహ ద్రవ్య సిద్ధాంతం 4) ఉత్పరివర్తన సిద్ధాంతం
శరీరం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను బయటకు పంపే బాధ్యతను చేసేది? 1) ఊపిరితిత్తులు 2) మూత్రపిండం 3) స్వేదగ్రంథి 4) కాలేయం
ఒక బీజకణం సాధారణంగా కలిగి ఉండేది? 1) జన్యువుకు సంబంధించి అన్ని యుగ్మవికల్పకాలు 2) జన్యువు అనేకమైన యుగ్మవికల్పకాలు 3) జన్యువు ఒక యుగ్మకల్పకం 4) జన్యువు రెండు యుగ్మకల్పకాలు
డౌన్‌సిండ్రోమ్ దేని వల్ల కలుగుతుంది? 1) పెరుగుదల హార్మోన్ తగ్గడం 2) 21వ జతలో అదనంగా ఒక క్రోమోజోమ్ ఉండటం 3) క్రోమోజోమ్ నిర్మాణంలో మార్పు 4) జన్యు ఉత్పరివర్తనం
విశ్వవ్యాప్త దాతలు రక్తాన్ని ఇతర అన్ని రక్త సముదాయాల వారికి ఇస్తారు. ఇందుకు గల కారణం? 1) ప్రతిరక్ష జనకాలు, ప్రతిదేహాలుంటాయి 2) ప్రతిదేహాలుండవు 3) ప్రతిరక్ష జనకాలుండవు 4) ప్రతిరక్ష జనకాలుంటాయి
కింది వాటిలో సమవిభజనతో ఏకీభవించదు? 1) శరీర సంబంధమైన కణ విభజన 2) జన్యుపరమైన అభిన్న పిల్ల కణాలు ఏర్పడటం 3) అలైంగిక ప్రత్యుత్పత్తి 4) ఏక స్థితిక లింగ కణాలు ఏర్పడటం
రక్తం గడ్డకడుతున్నప్పుడు, థ్రాంబోప్లాస్టిన్ దెబ్బతిన్న.. వీటి నుంచి విడుదలవుతుంది? 1) ఎర్రరక్తకణాలు 2) మాక్రోఫేజ్‌లు 3) ల్యూకోసైట్లు 4) రక్తఫలికలు
ఆస్పేడియం ఎలా పనిచేస్తుంది? 1) విసర్జక అవయవం 2) ప్రత్యుత్పత్తి అవయవం 3) జ్ఞాన అవయవం 4) శ్వాస అవయవం
సకశేరుకాల్లో శరీర కుహరం దేని నుంచి ఏర్పడుతుంది? 1) మధ్యస్త తచం, అంతఃతచం 2) మధ్యస్త తచం 3) బాహ్య తచం 4) అంతఃతచం
రెడ్ డేటా బుక్ అని దేనిని అంటారు? 1) అపాయకర, అరుదైన జాతుల జాబితా కలిగిన పుస్తకం 2) కార్ల్ మార్క్స్ రచించిన పుస్తకం 3) ఎర్రసముద్ర జీవసముహం కలిగిన పుస్తకం 4) ఎరుపు అట్టకలిగిన పుస్తకం
‘అంపుల్లా లోరెంజిని’ అనేది ఒక? 1) ఘ్రాణ గ్రాహకం 2) ఉష్ణ గ్రాహకం 3) పీడన గ్రాహకం 4) రసాయనిక గ్రాహకం
న్యూక్లిక్ అంశాలు (కేంద్రకాంశం) వేటిని ప్రత్యేకంగా అధికంగా కలిగి ఉంటుంది? 1) ఆర్ఎన్ఏ, కొవ్వుపదార్థాలు 2) ఆర్ఎన్ఏ, మాంసకృత్తులు 3) డీఎన్ఏ, కొవ్వుపదార్థాలు 4) డీఎన్ఏ, మాంసకృత్తులు
కార్పస్ కెల్లోజోమ్ ఎక్కడ ఉంటుంది? 1) మస్తిష్కార్ధ గోళాలు, మజ్జాముఖం మధ్యన 2) మస్తిష్కార్ధ గోళాలు, వెన్నుపాముల మధ్యన 3) రెండు మస్తిష్కార్ధ గోళాల మధ్యన 4) మెదడు, వెన్నుపాముల మధ్యన
కేరియాటైస్ అంటే? 1) క్రోమోజోమ్‌ల సంఖ్యను తెలియజేయడం 2) క్రోమోజోమ్‌ల రూపాన్ని తెలియజేయడం 3) క్రోమోజోమ్‌ల బాహ్య స్వరూపం సంబంధం తెలియజేయడం 4) పైవన్నీ
‘ఫాండర్స్’ అంటే 1) ఒక అపరిమిత జనాభా నుంచి వివిక్తత ద్వారా వేరే ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించుకునే జీవులు 2) పరిమిత జనాభా నుంచి జీవులు వేరుబడి అక్కడే వేరే ప్రాంతంలో సమూహంగా ఏర్పడటం 3) పరిమిత జనాభాలోని జీవుల మధ్య లైంగిక పరమైన వివిక్తత ద్వారా సమూహాలుగా ఏర్పడటం 4) 2, 3
‘ఫ్రిమార్టిన్’ అనేది ఒక? 1) ఏక సంయుక్త బీజం నుంచి ఏర్పడిన ఆడ సహకవల 2) ఏక సంయుక్త బీజం నుంచి ఏర్పడిన మగ సహకవల 3) ద్వితీయ సంయుక్త బీజం కవల్లో ఆడ సహకవల 4) ద్వితీయ సంయుక్త బీజ కవల్లో మగ సహకవల