పోటీ పరీక్షల్లో అత్యంత ప్రధానమైన విభాగం పాలిటీ. పాలిటీని చదువుతున్నప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను చూసి చాలామంది తికమక పడుతుంటారు. కాబట్టి పాలిటీ సబ్జెక్టుపై ఎలా పట్టు సాధించాలో తెలుసుకుందాం..
పాలిటీ నుంచి సాధారణంగాఎకువ ప్రశ్నలుంటాయి. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు-విభాగాలు, షెడ్యూళ్లు-పీఠిక-కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రాథమిక హకులు-ఆదేశసూత్రాలు-ప్రాథమిక విధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం-అధికారాలు-విధులు-పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు-హైకోర్టులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు-పంచాయతీరాజ్-నగరపాలక సంస్థలు, షెడ్యూల్డు కులాలు-తెగల వారి ప్రత్యేక అంశాలు, జాతీయ కమిషన్లు-అత్యవసర పరిస్థితి-రాజ్యాంగ సవరణలు లాంటి అంశాలను వివరణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రశ్నలు రాజ్యాంగ స్వభావం-స్వరూపం-పనితీరుపై ఉంటాయి. ప్రామాణిక గ్రంథాలు, ఇటీవలి ముద్రణలను మాత్రమే అనుసరించాలి.
రాజ్యాంగంలో పేరొన్న అధికరణలు, ప్రకరణలు, సవరణలకే పరిమితం కాకుండా.. వాటి ద్వారా సాధించిన సామాజిక ప్రగతిపై కూడాప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. రాజ్యాంగానికి ఎదురైన సవాళ్ల గురించి తెలుసుకోవాలి. వీటి పరిషారం దిశగా న్యాయస్థానాల చొరవపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ప్రజా సంక్షేమం దిశగా ప్రాథమికహకులు, శాసనాధికారాలు, కార్యనిర్వహణ విధుల గురించి క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేయాలి. విభిన్న వర్గాల సమానత్వం దిశగా తీసుకున్న చర్యలపై అవగాహన లేకపోతే రాజ్యాంగం, దాని భావనను అర్థం చేసుకోవడం కష్టం. రాజ్యం అధికారాలతో పాటు బాధ్యతలు, విధుల గురించి అవగాహన ఉండాలి. వీటన్నింటినీ రాజ్యాంగంలో అంతర్భాగంగా రూపొందించారు.
న్యాయ వ్యవస్థ క్రియాశీలత, కోర్టులు ఇచ్చే తీర్పులు, వ్యాఖ్యానాలు ఎలా ప్రభావితం చేయగలుగుతాయన్న అంశంపై నిర్దిష్టంగా అవగాహన పెంచుకోవాలి. సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతుందన్నది తెలుసుకోవాలి. రాజ్యాంగ పరిణామ క్రమం నుంచి రాజ్యాంగం ఎదురొంటున్న సవాళ్ల వరకు చదువుకోవాలి. భారత రాజ్యాంగం ఎలా పనిచేస్తుందన్న దానిపై జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ 2002లో ఇచ్చిన నివేదికను చదవాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సరారియా కమిషన్, పూంచీ కమిషన్ నివేదికలు, ఎన్సీఈఆర్టీ, తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి.
పాలిటీ సబ్జెక్టును ఎలా చదివినా పరవాలేదు. కానీ మొదటిసారి చదివేవారి నేపథ్యంలో ప్రారంభిస్తే కాస్త నెమ్మదించడానికి ఆసారం ఉంది. ఎందుకంటే ఈ అంశాలు అర్థం చేసుకోడానికి ఇంకాస్త పరిపక్వత అవసరం. అందువల్ల ప్రవేశిక, ప్రాథమిక హకులు, ప్రాథమిక విధులతో మొదలు పెట్టే బదులు కింది విధంగా మొదలు పెడితే త్వరగా అర్థం చేసుకోడానికి ఆసారం ఉంది.
మొదటగా భారత రాజ్యాంగం చదవడంలో ముఖ్యమైనది భారత ప్రభుత్వ కూర్పు, ప్రతి ప్రభుత్వంలో 3 శాఖలు చాలా ముఖ్యమైనవి. శాసనవర్గం, కార్యనిర్వహణ వర్గం, న్యాయవర్గం. దేశం ఒక సమాఖ్య వ్యవస్థ నిర్మాణం కలిగి ఉంటుంది. అంటే కేంద్రంలో, రాష్టంలో ఒకే తరహా నిర్మాణం కలిగి ఉంటుంది. కేంద్ర శాసనవర్గంలో భాగంగా పార్లమెంట్‌పై పూర్తి అవగాహన ఉండాలి. అంటే లోక్‌సభ, రాజ్యసభ వాటి విధులు, అందులోని సభ్యుల ప్రాముఖ్యత, బిల్లుల రకాలు-రకరకాల తీర్మానాలు, వివిధ కమిటీలు ఇలా రాష్ట్రంలో కూడా శాసనవర్గంలో భాగంగా శాసన సభ ఉంటుంది. ఈ రెండింటిపై కావాల్సినంత అవగాహన ఏర్పరుచుకుంటే ఇతర రెండు వర్గాల గురించి సులభంగా అర్థం అవుతుంది.
కేంద్ర నిర్వాహక వర్గంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రి మండలి, అటార్నీ జనరల్ ఉంటారు. వీరి విధులు, అధికారాలు క్లుప్తంగా చదవాలి. కేంద్రం లాగా రాష్ట్ర నిర్వాహక వర్గంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, అడ్వకేట్ జనరల్ ఉంటారు. వారి గురించి అవగాహన ఉండాలి.
న్యాయ వర్గంలో సుప్రీంకోర్టు, హై కోర్ట్ చదివితే సిలబస్‌పై పట్టు ఏర్పడుతుంది. ఆ తరువాత పంచాయతీలు, మునిసిపాలిటీలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ప్రవేశిక, ప్రాథమిక హకులు, విధాన సూత్రాలు, రాజ్యాంగ ఇతర సంస్థలు మొదలైన అంశాలు చదివితే సులభంగా పాలిటీపై ఇష్టం పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు పునశ్చరణ చేయడంతో పాటు సంబంధిత అంశాల ప్రాక్టీస్ బిట్స్‌ను సాల్వ్ చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది. పాలిటీ సులభం అనిపించినప్పటికీ మారులు చిన్న చిన్న పొరపాట్లతో పోగొట్టుకోవడానికి ఆసారం ఉంది. మరిచిపోవడం, తకువ మారుల సమస్యను అధిగమించాలంటే ప్రాక్టీస్ బిట్స్, పునశ్చరణ అవసరం.
ఇంటర్మీడియట్,( సివిక్స్) డిగ్రీ (బీఏ) పుస్తకాలు చదివితే మంచి విశ్లేషణతో పాలిటీని నేర్చుకోవచ్చు. గ్రూప్-2లో పాలిటీ రెండో పేపర్లో ఉంటుంది. ఇందులో హిస్టరీ, పాలిటీ, సమాజం ఉంటాయి. పాలిటీ నుంచి 50 మారులు అలాగే సమాజంలోని చాలా అంశాలు అనుసంధానం అయి ఉంటాయి. అలా దాదాపు 75 పైగా మారులు పొందడానికి ఎకువ ఆసారం ఉంటుంది.
కేంద్ర-రాష్ట్ర సంబంధాల అంశాన్ని లోతుగా పరిశీలన చేయాలి. ఇటీవల ఆలిండియా సర్వీసెస్ డిప్యుటేషన్ల సవరణల విషయంలో రాజ్యాంగంలో కేంద్రం రాష్ట్రాల విషయంలో ఏ విధంగా జోక్యం చేసుకోవచ్చు? చేసుకోరాదు? అని పొందుపరిచిన అంశాలను అవలోకనం చేసుకోవాలి. ఈ కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన కమిటీలు, వాణిజ్య సంబంధాలు మొదలైనవి కూలంకషంగా చదవాలి. ఈ కోణంలోనే పెరుగుతున్న ప్రాంతీయ వాదం ఈ ప్రాంతీయ వాదంతో వస్తున్న లాభాలు, నష్టాలు కూడా అధ్యయనం చేయాలి.
కార్యనిర్వాహక వర్గానికి, న్యాయవర్గానికి మధ్య సంబంధం, వీటి మధ్య న్యాయశాఖ స్వాతంత్య్రానికి సంబంధించి ఎలాంటి వివాదాలు ఏర్పడ్డాయి, ఈ వివాదాల్లో భాగంగా వచ్చిన చారిత్రాత్మక తీర్పులు ఉదాహరణకు శంకరీ ప్రసాద్, సాజన్ సింగ్, గోలక్ నాథ్, కేశవానంద, మినర్వా మిల్స్, ఏకే గోపాలన్, డీఎం జబల్పూర్, మేనకా గాంధీ మొదలైనవి.
వీటిలో భాగంగా న్యాయ శాఖ క్రియాశీలత, రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో సుప్రీంకోర్ట్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు? ఎన్ని కమిటీలున్నాయి, వాటి అధ్యక్షులు, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, ఇటీవల వాటిలో చేసిన మార్పులు, కేంద్ర సమాచార కమిషన్, జాతీయ మానవ హకుల సంఘం మొదలైనవి.
రాజ్యాంగ సవరణల విషయంలో కూడా చాలామందికి పూర్తి అవగాహన లేదు. అన్నింటిని ప్రత్యేక మెజారిటీ అనుకుంటారు. కానీ సాధారణ మెజారిటీ కూడా ఉంటుందని మరిచిపోవద్దు.
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కిందివిధంగా ఉన్నాయి. ఏ అంశం ఎంత ముఖ్యమైందో, మారుల పరంగా వీటిని తప్పకుండా వదలకుండా చదవాలో తెలుస్తుంది.
పై వాటిని బట్టి చూస్తే కార్యనిర్వాహకవర్గం నుంచి ఎకువ మారులు అడిగినట్టు తెలుస్తుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే సిలబస్‌లో ఉన్న ప్రతి అంశం నుంచి తప్పకుండా మారులు వస్తాయనుకోవడం పొరపాటు. అలాగని వాటిని వదిలివేయడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి సిలబస్ మొత్తం పూర్తి చేసిన తరువాత పైన పేరొన్న అంశాలపై కాస్త ఆసక్తి పెడితే బాగుంటుంది.
రెండో పేపర్లో మరొక సబ్జెక్ట్ సమాజం. ఇందులో కూడా 10 నుంచి 14 మారుల వరకు పాలిటీ సబ్జెక్టుతో సంబంధం ఉన్న ప్రశ్నలు అడగటానికి ఎకువ ఆసారం ఉంది. పాలిటీలో ముఖ్యంగా సామాజిక న్యాయం అడుగుతారు. ప్రాథమిక హకుల్లో సమానత్వ హకులు, 5, 6 షెడ్యూళ్లలోని అంశాలను లోతుగా పరిశీలిస్తే సమాజం అనే భాగంలో కూడా మంచి మారులు పొందవచ్చు.
సమాధానం ఎలా గుర్తించాలి?
బహుళ ప్రశ్నల ఎంపిక విషయంలో ఒక ప్రశ్నను ఎన్ని విధాలా తప్పు చేయవచ్చో, ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో పేపర్ సెట్టర్లు ముందుగానే ఊహించి తదనుగుణంగా ఆప్షన్లు ఇస్తారని గమనించాలి. మనకు వచ్చిన సమాధానం కనపడగానే వెంటనే గుర్తించవద్దు. ఒకక్షణం మిగతా ఆప్షన్లను కూడా పరిశీలించాలి. ఒకసారి ఒకటికంటే ఎకువ సరైన ఆప్షన్లు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అన్ని సరైన ఆప్షన్లను గుర్తించాలి. ఉదాహరణకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లో మూడు సరైనవైతే ఆ మూడింటిని గుర్తించాలని అడగవచ్చు. కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా తాము అప్పటివరకు చదివిన అంశాలపై ఎంత పట్టు సాధించామనేదానిపై స్వీయవిశ్లేషణ చేసుకోవాలి. సాధారణంగా ప్రిపరేషన్ అనంతరం సులభంగా అనిపించిన అంశాల పునశ్చరణకు మాత్రమే ప్రయత్నిస్తారు. అలా కాకుండా పూర్వం చదివిన కఠినమైన అంశాలనూ రివైజ్ చేయాలి.
గత ప్రశ్నపత్రాలను దృష్టిలో ఉంచుకొని 25 శాతం ప్రశ్నలు పునరావృతం అవుతాయి. వీటికోసం గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా పరీక్ష పద్ధతిని సమగ్రంగా తెలుసుకోవచ్చు. అప్పుడు ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే అంశాలపై అవగాహన వస్తుంది. అలాగే సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. వీటితో పాటు ఆన్లైన్లో నిర్వహించే మాక్ టెస్ట్‌లు రాస్తే ప్రిపరేషన్ బాగా చేయవచ్చు. అవగాహనలేని విషయాలను పునశ్చరణ చేసుకోవచ్చు. వాటిని మూల్యాంకనం చేసుకొని, ప్రిపరేషన్ పరంగా లోపాలను సరిదిద్దుకోవాలి. మాక్ టెస్టులు రాస్తున్నప్పుడే తగిన మెలకువలు అలవాటు చేసుకోవాలి.
పరీక్షలో కఠినమైన ప్రశ్నలను చూసి ఆందోళన చెందవద్దు. మొత్తం పేపర్ కఠినంగా అనిపించినప్పటికీ కంగారు పడనవసరంలేదు. పేపర్ల వారీగా వారాంతపు పరీక్షలకు హాజరు కావడం విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. వారంరోజుల్లో చదివిన అంశాలకు సంబంధించి టెస్ట్ రాయడం, ఫలితాలను విశ్లేషించుకోవడం చేయాలి. ఒక అంశాన్ని థియరిటికల్ అప్రోచ్‌తో చదవడానికే పరిమితం కాకుండా ప్రాక్టీస్ చేయాలి.
శిక్షణ తీసుకున్నవారికి, తీసుకోని వారికుండే వ్యత్యాసాలను దృష్టిలోఉంచుకొని ప్రశ్నపత్రాల రూపకల్పన, ప్రశ్నల స్వభావం ఉంటుంది. సిలబస్, పరీక్ష తెలంగాణ కేంద్రంగా ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రంలో దేవదాసి లేదా జోగిని వ్యవస్థ కింది ప్రాథమిక హకుల్లో దేన్నిఉల్లంఘిస్తుంది? ప్రశ్నలు కచ్చితంగా తెలంగాణతో సంబంధం ఉన్నవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
పై విధంగా చూస్తే గ్రూప్-2 రెండవ పేపర్ పాలిటీ నుంచి 65 మారుల వరకు రావచ్చు. వీటితోపాటు మొదటి పేపర్లో కూడా హకుల అంశాలు, కరెంట్ అఫైర్స్‌లో గాని ఇతర విధానాల విషయంలో కూడా పాలిటీతో పరోక్షంగా అనుబంధం కలిగి ఉంటుంది. అందువల్ల గ్రూప్-2లో పాలిటీలో 70 నుంచి 72 మారులు రావచ్చు. మంచి ప్రణాళికతో వ్యూహాత్మకంగా, ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు పాటిస్తే 65 మార్కులు తెచ్చుకోవచ్చు.
పాలిటీలో ఎదురొనే మరొక సమస్య ప్రకరణలు/ఆర్టికల్స్‌ను రాజ్యాంగ సవరణలు వాటి సంఖ్యకు సంబంధించిన అంశాలు, షెడ్యూళ్ల భాగాలు ఇలా వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. దీనికి పరిషారం పునశ్చరణే. ఆర్టికల్స్ ప్రకారం కాకుండా అంశాలను బట్టి, విషయాన్ని బట్టి చదివితే బాగుంటుంది.
కేసుల విషయంలో చాలా లోతుగా పరిశీలన చేస్తూ ఎకువ సమయం కేటాయిస్తారు. అది సరైన పద్ధతి కాదు. ఆ అధిక సమయాన్ని ఇతర అంశాలకు కేటాయించాలి. ప్రతి అంశంలో కొన్ని ముఖ్యమైన లేదా రాజ్యాంగ గతిని మార్చిన కేసులు ఉంటాయి. అలాగే కొన్ని కేసుల గురించి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. ఈమధ్య వార్తల్లో నిలిచిన కేసులు చదివితే సరిపోతుంది.
రాజ్యాంగబద్ధ సంస్థల విషయంలో కార్యనిర్వహణ వర్గానికి, ఆ సంస్థల అధ్యక్షులకు మధ్య వివాదాలు, డీ లిమిటేషన్ కమిషన్, గవర్నర్ పదవిపై వివాదాలు, సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రభుత్వాల కొత్త జీవోలు, నూతన చట్టాలు, పార్టీ ఫిరాయింపు చట్టాలు, రాష్ర్టాల మధ్య వివాదాలు, కేంద్రం ఏక కేంద్ర తరహా విధానాలు, జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, కేంద్ర పాలిత ప్రాంతాలు వంటి మొదలైన ఎన్నో అంశాలు వార్తల్లో నిలిచాయి. చదివిన వాటిని, చదవబోతున్న వాటిని, చదవాల్సిన వాటిని ఇలా అన్నింటిని అనుసంధానం చేసుకొని చదవాలి.
రివిజనే విజయ సాధనం
పరీక్షలో విజయం దిశగా మలి దశలో ఉపకరించే సాధనం రివిజన్ (పునశ్చరణ). దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలను పాయింట్లుగా లేదా అనుకూలమైన రీతిలో (చార్ట్‌లు, గ్రాఫ్‌లు వంటివి) షార్ట్ నోట్స్ రాసుకోవాలి. చదివిన అంశాలను ఇతరులతో చర్చించడం, స్వీయ మూల్యాంకనం చేసుకోవడం కూడా మెమరీపరంగా బాగా ఉపయోగపడుతుంది. సొంత నోట్స్‌ను రూపొందించుకోవడం విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. చదివిన ప్రతి అంశాన్నీ నోట్స్‌లో పొందుపరిస్తే సమయం వృథా అవుతుంది. ఒక పుస్తకాన్ని కనీసం రెండుసార్లు చదివేతేనే నోట్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. గణాంకాలు, సంవత్సరాలు, నివేదికలు-సిఫారసులు వంటి ముఖ్యాంశాలను మాత్రమే మొదటి పఠనంలో రాసుకోవాలి. ఈ నోట్స్‌లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎన్నిసార్లు చదివితే అంతమంచిది. ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో చాలా ముఖ్యమైన అంశాలను షార్ట్‌కట్స్‌గా రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు క్విక్ రివిజన్గా ఉండేలా నోట్స్ రూపొందించుకోవాలి. అప్పుడు పరీక్ష సమయంలో ఉపయోగపడుతుంది.
గ్రూప్స్ ASPIRANTS అభ్యర్థులు ముందుగా ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధమవాలి. ఒత్తిడి అనే మాటకు స్థానమివ్వకూడదు. పోటీ లక్షల్లో ఉన్నా ఉద్యోగం సాధించాలనే గట్టి సంకల్పం, విజయం సాధించగలమనే ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించవచ్చు. సంకల్ప బలంతో విజయం దిశగా దూసుకెళ్లవచ్చు.
అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రధానం. సమయపాలన విషయంలో కొందరు వారం ఆధారిత విధానాన్ని అనుసరిస్తారు. ఒక వారంలో ఒక సబ్జెక్టు, మరో వారం మరో సబ్జెక్టు చదువుతారు. ఇది విజయానికి సరైన ప్రణాళిక కాదు. పేపర్ల వారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని, రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే అన్ని అంశాల మధ్య సమతుల్యత సాధ్యమవడంతో పాటు అనుసంధానం చేసుకోచ్చు.
ఇతర సబ్జెక్టులు
విజయం సాధించేందుకు ఉపయోగపడే మరో ముఖ్యాంశం.. సబ్జెక్టులను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ వంటి సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఇది చాలాముఖ్యం. చదువుతున్నా, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తున్నా, ప్రిపరేషన్ ఏ దశలోఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏవైనా తప్పులు గుర్తిస్తే వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే బిడియపడకుండా ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలి.
గ్రూప్-2లో ఎక్కువమంది చేస్తున్న పొరపాటు సిలబస్‌లోని అంశాలను నేరుగా బిట్స్ రూపంలో చదవడం. ఇది ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు డిస్రిప్టివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. దీనివల్ల ఒక అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ప్రశ్న ఏ విధంగా అడిగినా సమాధానం ఇవ్వగల సామర్థ్యం లభిస్తుంది. డిస్రిప్టివ్ తరహాలో ప్రిపరేషన్ చేసేటప్పుడు ముఖ్యాంశాలను పాయింటర్స్లా లేదా నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఫలితంగా రివిజన్ చేసేటప్పుడు సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా సబ్జెక్టులకు సమప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ సబ్జెక్టుల్లో షార్ట్‌కట్స్ నోట్స్ విధానం ఎంతోఅవసరం.
ఆయా పేపర్లు, నిర్దేశిత సిలబస్ అంశాలపై అవగాహన పొందడంలో బహుముఖ వ్యూహం పాటించాలి. ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో (నేపథ్యం, పర్యవసానం, పరిషారం, ఫలితం) అధ్యయనం చేయాలి. అప్పుడే పూర్తిస్థాయిలో సన్నద్ధత లభించి ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇచ్చే నేర్పు సొంతమవుతుంది.
అసలు చదువుతున్న అంశాల్లో ఏవి ముఖ్యమైనవనే సందేహం కలుగుతుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం వల్ల ఏ అంశాల నుంచి ఎకువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ప్రశ్న అడిగే విధానంపై అవగాహన ఏర్పడుతుంది. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు కూడా ముఖ్యమైనవి. ఫ్యాకల్టీ, విజేతల సూచనలు తీసుకొని ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపికచేసుకోవాలి.
ఒక సబ్జెక్టు లేదా అంశాన్ని చదువుతున్నప్పుడు విసుగొస్తే వెంటనే ఆసక్తి ఉన్న మరో సబ్జెక్టు లేదా అంశంపై దృష్టిసారించాలి. అంతేకానీ ఆసక్తి లేకున్నా పరీక్షల కోణంలోముఖ్యమైంది కాబట్టి అదే అంశానికి గంటలకొద్దీ సమయం వెచ్చిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకే విధమైన సిలబస్ ఉన్న రెండు పేపర్లను ఒకే సమయంలో పూర్తిచేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
కరెంట్ అఫైర్స్
ఇటీవల కాలంలో ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో వీటికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణంగా పరీక్ష తేదీకి ముందు సంవత్సరకాలంలో జరిగిన సంఘటనల నుంచి ప్రశ్నలు వస్తాయి. సగాని కంటే ఎకువ ప్రశ్నలు పరీక్ష తేదీకి మూడు/నాలుగు నెలలకు ముందు జరిగిన అంశాల నుంచే ఉంటాయి. ఉదాహరణకు పరీక్ష ఆగస్టులో జరిగితే 2021 ఆగస్టు నుంచి వర్తమాన విషయాలు చదవాలి. అదేవిధంగా ఇతర అంశాలను అధ్యయనం చేయాలి. ప్రాంతీయ, జాతీయ వర్తమాన విషయాలకోసం వార్తాపత్రికలను చదవడం దినచర్యలో భాగం చేసుకోవాలి.
ముఖ్యమైన సంఘటనలపై వార్తా పత్రికలను చదవాలి. పుస్తకాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒకే పుస్తకాన్ని ఎంచుకొని దాన్నే చాలాసార్లు చదవాలి. అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోవాలి. అంతకుముందు చదివిన అంశాలను రివిజన్ చేసేందుకు రోజూ కొంత సమయం కేటాయించుకోవాలి. ప్రత్యేకంగా టైం టేబుల్ రూపొందించుకోవాలి. పరీక్ష ఏదైనా అందులో విజయం సాధించాలంటే రివిజన్ (పునశ్చరణ) చాలా ముఖ్యం. అందుకే వీలైనంత త్వరగా ప్రిపరేషన్ పూర్తిచేసి, పరీక్షకు ముందు రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి.
రోహిత్ కొమ్మ,21st సెంచరీ అకాడమీ
అశోక్‌నగర్, హైదరాబాద్ , 9133237733