హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్‌కుమార్ తెలిపారు. 9,10,11 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించారు. మూడ్రోజులపాటు ఆరు సెషన్లల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 125 సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మూడ్రోజుల్లో 2,10,766 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఒక్కో సెషన్లో 35వేల మంది పరీక్షలు రాస్తారని, ఇప్పటికే హాల్‌టికెట్లు జారీచేశామని వివరించారు. విద్యార్థులు ముందుగానే సెంటర్లకు చేరుకోవడం ఉత్తమమని సూచించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు ఈనెల 4,5 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
