తిరువనంతపురం : తండ్రేమో పెట్రోల్ బంక్‌లో వర్కర్. తల్లేమో బజాజ్ మోటార్స్‌లో వర్కర్. కానీ ఆ దంపతుల కుమార్తె మాత్రం తనకున్న అడ్డంగులను అధిగమించి ఐఐటీ కాన్పూర్‌లో సీటు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
కేరళలోని కన్నూరు జిల్లా పయ్యనూరులోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్‌లో ఎస్ రాజగోపాలన్ అనే వ్యక్తి గత 20 ఏండ్ల నుంచి వర్కర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య కేకే శోభన స్థానికంగా ఉన్న బజాజ్ మోటార్స్‌లో వర్కర్‌గా పని చేస్తోంది. ఈ దంపతుల బిడ్డ ఆర్య తనకున్న ఆర్థిక సమస్యలను అధిగమించి బీటెక్ పూర్తి చేసింది. ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్(పెట్రో కెమికల్ ఇంజినీరింగ్) సీటు లభించింది ఆర్యకు.
ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వర్కర్ రాజగోపాలన్ కుమార్తె ఆర్య స్ఫూర్తిదాయకమైన స్టోరీని మీతో పంచుకుంటున్నాను. ఐఐటీ కాన్పూర్‌లో ఆర్య సీటు సాధించడం సంతోషంగా ఉందంటూ వైద్య పేర్కొన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ఆర్యకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Let me share an inspiring story of Arya, daughter of #IndianOil's customer attendant Mr. Rajagopalan. Arya has made us proud by securing entry in IIT Kanpur.
— ChairmanIOC (@ChairmanIOCL) October 6, 2021
All the best and way to go Arya! pic.twitter.com/GySWfoXmQJ