1. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
1) ఈసారి డాక్టర్ నాగరాజుసురేంద్రకు వచ్చింది
2) గాలిబ్ నాటి కాలం పేరుతో రాసిన అనువాదానికి వచ్చింది
3) ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురికి వచ్చింది
4) దేశంలోని మొత్తం 24 భాషల సాహిత్యవేత్తలకు ఈ పురస్కారం ఇస్తారు
5) కేవలం దక్షిణ భారత
సాహిత్యవేత్తలకు మాత్రమే ఇస్తారు
జవాబు: 1,2,3,4లు సరైనవి
2. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1954 2) 1955
3) 1966 4) 1974
జవాబు: 1
3. మారిషస్ 56వ జాతీయ దినోత్స వాలకు మార్చి 12న ముఖ్య అతిథిగా హాజరైనవారు?
1) ప్రధాని నరేంద్ర మోదీ
2) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
3) ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్
4) విదేశాంగ మంత్రి జైశంకర్
జవాబు: 2
4. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డేని నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏ రోజున గెజిట్ జారీ చేసింది?
1) 2024, మార్చి 12
2) 2024, మార్చి 10
3) 2024, మార్చి 11
4) 2023, మార్చి 12
జవాబు: 1
5. తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై ఉన్న టీఎస్‌ను టీజీగా మార్చడానికి కేంద్ర రవాణా శాఖ ఏ తేదీన గెజిట్ జారీ చేసింది?
1) 2024, మార్చి 12
2) 2024, మార్చి 1
3) 2024, మార్చి 13
4) 2023, మార్చి 12
జవాబు: 1
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్ సౌజన్యంతో…