హనుమకొండ చౌరస్తా, మే 11 : సీపీగెట్-2026 ద్వారా అందించే ఐదు సంవత్సరాల సమగ్ర కోర్సుల ప్రవేశ ప్రక్రియను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)కు మార్చినట్టు టీజీసీపీగెట్-2026 కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ సోమవారం తెలిపారు. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ ఐదు సంవత్సరాల సమగ్ర కోర్సును దోస్త్‌కు మార్చినట్టు చెప్పారు.
ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు దోస్త్ పోర్టల్ ద్వారా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎస్సీహెచ్ఈ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సుల ప్రవేశాలు ఇకపై సీపీగెట్-2026 కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించరని, అభ్యర్థులు దోస్త్ ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలు, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు విధానాలను జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.