హైదరాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ): ఇజ్రాయెల్‌లో హోమ్ కేర్‌గివర్స్ ఉద్యోగాల భర్తీకి టామ్‌కామ్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఏఎన్ఎం/జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్/ఎంపీహెచ్‌డబ్ల్యూ/బీపీటీ/ఏదైనా సంవత్సర కాల పరిమితిగల కేర్‌గివర్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. 25-45ఏండ్ల మధ్య వయసు, కనీసం రెండేళ్ల క్రితం పొందిన పాస్‌పోర్ట్, సంవత్సరం అనుభవం ఉండాలి. అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను tomcom.overseasmanpower@gmail.com అడ్రస్‌కు మెయిల్ చేయడమో లేక 8247838789కు వాట్సాప్ ద్వారా పంపాలి.
10% మార్కులొచ్చినా మెడికల్ పీజీ సీటు
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): నీట్ పీజీ సీట్లకు అర్హత మార్కులను తగ్గిస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నిర్ణయం తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 10 శాతం మార్కులు సాధించినా కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చని తెలిపింది. జనరల్ క్యాటగిరీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 15 శాతంగా నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఎన్ఎంసీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది.