BSF Recruitment: సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి (BSF Recruitment) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 3588 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 3406 పోస్టులు, మహిళలకు 182 పోస్టులు కేటాయించింది. అధికారిక వెబ్సైట్ rectt.bsf.gov.in, bsf.gov.in ద్వారా ఆన్లైన్లో ఆగస్టు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా తప్పులు చేసి ఉంటే ఆగస్టు 24 నుంచి 26 వరకు సవరణలు చేసుకోవచ్చు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (PET), రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ట్రేడ్ల వారీగా..
మొత్తం 3588 పోస్టులను భర్తీ చేస్తుండగా, ఇందులో పురుషులకు 3406 పోస్టులు (కోబ్లర్-65, టైలర్ 18, కార్పెంటర్ 38, ప్లంబర్ 10, పెయింటర్ 05, ఎలక్ట్రిషన్ 04, కుక్ 1462, పంప్ ఆపరేటర్ 01, అప్హోల్స్టర్ 1, ఖోజి 03, వాటర్ క్యారియర్ 699, వాషర్ మ్యాన్ 320, బార్బర్ 115, స్వీపర్ 652, వెయిటర్ 13), మహిళలకు 182 పోస్టులు(కోబ్లర్ 2, టైలర్ 1, కార్పెంటర్ 1, కుక్ 82, వాటర్ క్యారియర్ 38, వాషర్ మెన్ 17, బార్బర్ 06, స్వీపర్ 35) చొప్పున ఉన్నాయి.
అర్హతలు..
కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కుక్, వాటర్ క్యారియర్, వేటర్ వంటి ట్రేడ్స్ కోసం ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సు (ఎన్ఎస్డీసీ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి) చేసి ఉండాలి. కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రిషియన్ వంటి పోస్టులకు 2 సంవత్సరాల ఐటీఐ లేదా 1 సంవత్సరం కోర్సు + 1 సంవత్సరం అనుభవం అవసరం. వడ్రంగి, టైలర్, వాషర్మన్, బార్బర్ వంటి ట్రేడ్స్‌కి సంబంధిత నైపుణ్యం ఉండాలి. ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి. వయస్సు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
నాలుగు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో మొదటగా శారీరక ప్రమాణాల పరీక్ష (PST), శారీరక సామర్థ్య పరీక్ష (PET) జరుగుతుంది. కొన్నిసార్లు ట్రేడ్ టెస్ట్ కూడా ఈ దశలో నిర్వహిస్తారు. తరువాత దశగా ఆబ్జెక్టివ్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, అవసరమైతే ట్రేడ్ టెస్ట్‌కు పిలుస్తారు. చివరి దశగా పూర్తి శరీర పరీక్ష (మెడికల్ ఎగ్జామినేషన్) జరుగుతుంది. పీఎస్టీలో పురుషుల కోసం ఎత్తు, ఛాతీ ప్రమాణాలు ఉండేలా చూసుకుంటారు. మహిళలకు కేవలం ఎత్తు ప్రమాణాలనే పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకూ రూ.150 + 18 శాతం జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, బీఎస్ఎఫ్ సిబ్బంది, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజును యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు.
అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వెబ్సైట్: https://rectt.bsf.gov.in