Medical Coding Training | అడ్డగుట్ట, జూలై 9 : నిరుద్యోగ యువతకు అప్సా టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు శిక్షణ అందిస్తున్నట్లు హబ్సిగూడ సెంటర్ సమన్వయకర్త పురుషోత్తం గోపి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
20 – 27 సంవత్సరాల మధ్య వయస్సు గల బీఎస్సీ, ఎమ్మెస్సీ , బీఫార్మా, ఎంఫార్మా, బీకాం, ఎమ్ కాం విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెడికల్ కోడింగ్‌లో (మెడికల్ టెర్మినాలజీ , హ్యూమన్ అనాటమీ, పీసీయాలజీ, ఐసీడీ – 10, సీపీటీ, హెచ్సీపీఎస్, ఆర్సీఎం) బిల్లింగ్ టెర్మినాలజీ, ఎమ్మెస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ విభాగాల్లో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. అందులో భాగంగా ఈనెల 11వ తేదీన నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని , ఆసక్తి గలవారు వారి తల్లి, తండ్రి, గార్డియన్ తో వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం 9154990132, 9154990131, 9154990130 నెంబర్లకు సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.