హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్‌కు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గాయి. నిరుడు 92 వేల దరఖాస్తులు రాగా, మంగళవారం వరకు 79 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 77 వేల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఈ నెల 19న దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనున్నది. రూ.100 అపరాధ రుసుముతో 21వరకు, రూ.300 అపరాధ రుసుముతో 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశమున్నది.
20లోగా ‘సీసీఈ మార్కులు’ ఎంట్రీ చేయాలి
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 20లోగా నిరంతరం సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) మార్కులను ఎంట్రీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. విద్యా సంవత్సరం ముగింపునకు చేరుకోవడంతో 20లోపు ఎంట్రీ చేసి 21న ఆన్లైన్ ప్రోగ్రెస్కార్డులను డౌన్లోడ్ చేసి పరిశీలించాలని, 23న జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో విద్యార్థులకు అందజేయాలని సూచించింది.