హైదరాబాద్: తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి ఆదిలాబాద్ జిల్లా లోని దాస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు (Horticulture Diploma) నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించే ఈ కోర్సులో 60 శాతం గ్రామీణ, 40 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సీట్లు కేటాయించామని వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ తెలిపారు. విద్యార్హతలు, ఫీజు, ఇతర వివరాల కోసం తమ వెబ్సైట్ www.skltghu.ac.inలో చూడాలని వెల్లడించారు. ఏవైనా సందేహాలు ఉంటే మొబైల్ నంబర్లు.. 9603268682, 91215 57037, 93981 66973, 70751 20145 లేదా యూనివర్సిటీ వెబ్సైట్ను (www.skltghu.ac.in) సందర్శించ వచ్చని పేర్కొన్నారు.