AP EAPCET 2025 | ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు జాబితాను ఏపీ ఉన్నత విద్యామండలి బుధవారం నాడు విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం నాడే సీట్ల కేటాయింపు ప్రకటించాల్సి ఉంది.. కానీ సాంకేతిక కారణాల వల్ల జాబితా విడుదల ఆలస్యమైంది.
మొదటి రౌండ్లో అభ్యర్థులకు కేటాయించిన సీటు వివరాలు తెలుసుకునేందుకు https://eapcet-sche.aptonline.in/EAPCET/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. తొలి జాబితాలో సీటు పొందిన అభ్యర్థులు జూలై 26వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఇంజినీరింగ్ తరగతులు మొదలవుతాయి. కాగా, దాదాపు 1.20 లక్షల మంది పాల్గొన్నారు.
సీటు అలాట్మెంట్ వివరాలు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ముందుగా వెబ్‌సైట్‌లోని హోంపేజీలో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్టు డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.