Anurag University | పోచారం, మే2 : పోచారం మున్సిపాలిటీ వెంకటాపురంలోని అనురాగ్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఈనెల 6న నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ మహిపతి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా యూనివర్సిటీ ఈ పరిక్షను నిర్వహిస్తుందని అన్నారు.
ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు అర్హులని మహిపతి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్ధులకు మే 11న స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు అనురాగ్ యూనివర్సిటీలో ఈ పరీక్ష ప్రారంభం అవుతుందని వివరించారు. స్కాలర్షిప్ పరీక్షలో పొందిన ర్యాంకుల ఆధారంగా 1 నుంచి 10 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు 100 శాతం ,11నుంచి 25 శాతం ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు 50శాతం, 26నుంచి 100 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 25 శాతం స్కాలర్షిప్లను యూన్సివర్సిటీ అందిస్తుందని శ్రీనివాస్‌రావు తెలిపారు. విద్యార్ధులు స్కాలర్షిప్ పరీక్షను సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని సూచించారు.