న్యూఢిల్లీ: కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 400 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ ఖాళీలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 400
ఇందులో జనరల్ 163, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 108, ఎస్సీ 59, ఎస్టీ 30, పీడబ్ల్యూడీ 4 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ లేదా బీటెక్ చేసి ఉండాలి. 2022, జులై 14 నాటికి 27 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జులై 14
వెబ్సైట్: www.aai.aero