హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు 40శాతం లోపే అభ్యర్థులు హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు 33 సెంటర్లల్లో పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం 9,905 మందికి ఉదయం 4,169(42శాతం), మధ్యాహ్నం 4,155(41శాతం) చొప్పున పరీక్షకు హాజరయ్యారు. శనివారం 9,907 మందికి ఉదయం 3,7,99(38శాతం), మధ్యాహ్నం 3,787(38శాతం) చొప్పున పరీక్షకు హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
డిగ్రీ సీట్ల భర్తీకి రేపు స్పాట్ కౌన్సెలింగ్
హైదరాబాద్, జనవరి 4 (నమస్తేతెలంగాణ): వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ (ఫిషరీస్) డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీకి సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని జయశంకర్ అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు. జనరల్ కోటా సీట్ల కోసం ఉదయం పది గంటలకు, స్పెషల్ కోటా సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. ఎప్సెట్-24లో ర్యాంకు సాధించి, ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. www. pjtsau. edu.in <http://www.pjtsau.edu.in>లో సంప్రదించాలని సూచించారు.