మంగళవారం 11 ఆగస్టు 2020
Nipuna-education - Jul 15, 2020 , 02:30:40

బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు !

బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు !

తెలుగు రాష్ర్టాలలో ఎక్కువమంది రాసే వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌), ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు బీటెక్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలను రద్దుచేశాయి.కొవిడ్‌ నేపథ్యంలో ప్రవేశపరీక్షలను రద్దుచేసి ఇంటర్‌లో వచ్చిన మార్కులతో ప్రవేశాలు కల్పించనున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను విట్‌, ఎస్‌ఆర్‌ఎం విడుదల చేసాయి. ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కోర్సుల్లో చేరవచ్చు. అదేవిధంగా జేఈఈ మెయిన్‌లో వచ్చిన మార్కులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు విట్‌ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

విట్‌: https://vit.ac.in/BTechAdmissions

ఎస్‌ఆర్‌ఎం: https://www.srmist.edu.inlogo