
ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2022 నాటికి 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీస్ అని తరచూ వింటూ ఉంటాం కదా అవన్నీ ఈ 4.0 టెక్నాలజీ అనువర్తనాలు. ఇండస్ట్రీ 4.0 ను 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ అని కూడా అంటాం. సైబర్ అండ్ ఫిజికల్ కలయికనే నాలుగో ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)/మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, IoT, వర్చువల్ రియాలిటీ/ఆగ్మెంటేడ్ రియాలిటీ, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ వంటి వాటిని 4.0 టెక్నాలజీస్ అంటారు.
దేనికి ఉపయోగిస్తున్నాం?
మొబైల్ ఫోన్లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో దానిని చూడగానే అన్‌లాక్ అవుతుంది కదా. అదే మరొకరి ముఖం అయితే అన్‌లాక్ అవదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే సాధ్యమవుతుంది. అంతే కాకుండా తరుచూ వినే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఆటో పైలట్ వంటి వాటిలో, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఇలాంటి స్మార్ట్ డివైజెస్‌లలో కూడా ఉపయోగించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే.
ఇదంతా ఆరంభం మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చాలా రాబోతున్నాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, బ్యాంకింగ్ ఇలా చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించనున్నారు.
ఇలా ఇన్ని రంగాల్లో దీన్ని ఉపయోగిస్తాం అంటే ఇది సాధారణమైన టెక్నాలజీ కాదు. అలాగే అది ప్రపంచ సంపదకు ఎంత విలువను తీసుకురాబోతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మెకిన్సే రిపోర్ట్ ప్రకారం ప్రతి ఏటా 13 ట్రిలియన్ అంటే అక్షరాలా 95,58,57,50,00, 00,000 రూపాయిలను 2030కి సృష్టించనుంది. ఇంత సంపాదన సృష్టిస్తుంది కాబట్టే దీనివల్ల చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి.
ఏఐ అంటే ఏమిటి?
మనిషిగా మనకున్న ముఖ్యమైన స్కిల్స్‌ని గమనించడం. అలా ఒక దానిని గమనించి దానిలో పెటరన్స్ని గుర్తిస్తాం. ఏ విధంగా అయితే చూడటం, వినడం, తాకడం ద్వారా పెటరన్స్ని గుర్తిస్తామో అదే విధంగా ఒక మెషిన్ ఇలా పెటరన్స్ని గుర్తిస్తే దీనినే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఏ విధంగా అయితే మనం విని, చూసి బ్రెయిన్లో ప్రాసెస్ చేసి పెటరన్స్ని గుర్తిస్తామో, అదే విధంగా మెషిన్‌కి కావాల్సిన ఇటువంటి డేటాను ఇన్‌పుట్‌గా ఇస్తాం. ఆ లోడ్ చేసిన డేటాలో పెటరన్స్ని గమనించడానికి సాఫ్ట్వేర్ తయారు చేసి ఇస్తాం. వీటినే ఇంటెలిజెంట్ మెషీన్స్ అంటాం. ఇలాంటి ఇంటెలిజెంట్ మెషీన్స్‌ని తయారు చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి 1950లోనే రిసెర్చ్ మొదలయ్యింది. కానీ ప్రపంచానికి దీని గురించి తెలిసింది 1997లోనే.
అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఉబెర్, టెస్లా వంటి సంస్థలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వారి సంస్థను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా వారి కస్టమర్స్‌కు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వగలుగుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తే అందులో ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మన పెటరన్స్ను గమనించి అటువంటి సినిమాలే మనకి చూపిస్తుంది. అలాగే ఇటీవల రికార్డు సృష్టిస్తున్న టెస్లా కారులోని ఆటో పైలట్‌లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తారు.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ (ANI), ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI). ఈ ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ కేవలం ఒక పనిని మాత్రమే చేయగలుగుతుంది. ఉదాహరణకు చెస్ గేమ్ ఆడే సాఫ్ట్వేర్ కేవలం అది మాత్రమే ఆడగలదు. ఎంత బాగా ఆడుతుందంటే చెస్ వరల్డ్ చాంపియన్ని సైతం ఓడించగలదు. కానీ వేరే ఏ పని చేయలేదు.
అదే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఒక మనిషి ఏం చేయగలడో అన్ని పనులు చేయగలదు. ఉదాహరణకు రోబో సినిమాలో చిట్టీని చూశాం కదా అది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పై వర్క్ అవుతుంది. కానీ గత 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఏఐలో జరిగిన పురోగతి అంత కూడా ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్‌లోనే జరిగింది. చాలా తక్కువ శాతం మాత్రమే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వైపు జరిగింది.
శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెజెన్స్ (AGI)లో అప్లికేషన్స్, సిస్టమ్స్ కనీసం 20 నుంచి 25 సంవత్సరాల వరకు తయారుచేయలేం. ఎందుకంటే దాని కోసం చాలా పురోగతి సాధించాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఐబీ హబ్స్, నెక్ట్స్‌వేవ్ సీసీబీపీ ప్రోగ్రామ్స్ ద్వారా ఏఐ వంటి మరెన్నో 4.0 టెక్నాలిజీల్లో శిక్షణ ఇస్తుంది. ఈ ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాల కోసం ccbp.inని చూడండి లేదా support@nxtwave.techకి మెయిల్ పంపండి. యూట్యూబ్, ఉడెమి, కోర్స్ ఎరా వంటి వాటిలో కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌ను నేర్చుకోవచ్చు.
ఈ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌ని ప్రాక్టికల్ గా నేర్చుకుని అప్లికేషన్స్, ప్రాజెక్ట్స్ చేయాలంటే హైస్కూల్ గణితం, ప్రోగ్రామింగ్‌లోని బేసిక్స్ కూడా నేర్చుకోవాలి.
ఈ ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాల కోసం 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేదా support@nxtwave.tech కి మెయిల్ పంపండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విద్యుత్, నిప్పు కంటే కూడా చాలా ముఖ్యమైనది.
త్రివిక్రమ్
సీఈఓ, డైరెక్టర్ ప్రోయుగ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్